
CM Jagan- Vizag: మూడు రాజధానుల మీద హై కోర్టు లో కేసు నడుస్తోంది. తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. మరోవైపు అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర ముగిసింది.. కానీ పచ్చ మీడియా, అమరావతి రాజధాని ముసుగులో భూములు దోచుకున్న బడా బాబుల శోకాలు మాత్రం ఆగడం లేదు. ఏబీఎన్, టీవీ 5, మహా టీవీ. ఇలా రోజుకో రకంగా రచ్చ చేస్తున్నాయి. డిబేట్లలో పచ్చదనం నిండిన వారితో చర్చలు కొనసాగిస్తున్నాయి.. కానీ ఇవేవీ జగన్ ను కదిలించడం లేదు. వణికించడం లేదు. అంతేకాదు ఏపీ పరిపాలన రాజధానిగా వైజాగ్ వైపు మరింత దూకుడుగా అడుగులు వేస్తున్నారు.. ఇప్పటికే రుషి కొండను పొతం చేస్తున్నారు. 65.13 ఎకరాలు సమీకరించారని తెలుస్తోంది. అందులో ప్రభుత్వ పరంగా భవనాలు కూడా నిర్మిస్తున్నారని సమాచారం.. అంతేకాదు మంత్రులు, ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కూడా నిర్మించబోతున్నారని తెలుస్తోంది.
మరోవైపు విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు ఇవ్వాల ప్రారంభమైంది. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఇతర బడా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా వేదిక మీద మరో మారు జగన్ తన మనసులో మాట చెప్పాడు.. విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలన రాజధాని కాబోతోందని, తన నివాసం కూడా త్వరలో ఇక్కడికే మార్చుకుంటానని జగన్ స్పష్టం చేశారు. గతంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ జగన్ ఇదే మాట చెప్పారు. ఎప్పుడైతే జగన్ ఇలాంటి ప్రకటన చేశారో, అప్పటినుంచి పచ్చ మీడియా శోకాలు పెడుతూనే ఉంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని మార్చేందుకు వీలులేదని మంగమ్మ శపథాలు చేస్తోంది. మరోవైపు బిజెపి కూడా అమరావతి వైపు పాజిటివ్ వా మాట్లాడుతున్నా జగన్ లెక్కచేయడం లేదు.. మరోవైపు పరవాడ ప్రాంతంలో భారీ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఈరోజు ముకేశ్ అంబానీ కూడా పెట్టుబడుల సదస్సు హాజరు కావడం వెనుక ఉద్దేశం అదే అని తెలుస్తోంది. మొత్తానికి జగన్ మాస్టర్ స్ట్రోక్ వల్ల పచ్చ పార్టీ, పచ్చ మీడియా గింగిరాలు తిరుగుతోంది.
ఇన్ సైడ్ ట్రేడింగ్ వల్లేనా
అమరావతి రాజధానికి సంబంధించి మొదట్లో జగన్ తన సంఘీభావాన్ని ప్రకటించాడు. కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతి రాజధానికి సంబంధించి ఒక సామాజిక వర్గం వారు భారీగా భూములు కొనుగోలు చేశారని, రాజధాని ఏర్పాటు సమాచారం ముందుగానే వారికి తెలిసిపోయిందని జగన్ దృష్టిలో ఉంది. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా రాజధాని విషయం మీదనే జగన్ దృష్టి సారించారు.. ఇందులో భారీ ఎత్తున ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. దానిని నిరూపణ చేసే ఆధారాలు బయట పెట్టకపోయినప్పటికీ… మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది ప్రస్తుతం కోర్టులో ఉన్నప్పటికీ.. పరిపాలన రాజధానిగా విశాఖపట్టణాన్ని ప్రకటించారు.

అయితే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పరిపాలన సాగుతుంది కాబట్టి, కోర్టు కూడా దీనికి అభ్యంతరం తెలపకపోవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ విషయం తెలిసే జగన్ వైజాగ్ వైపు సృష్టి సారించారని తెలుస్తోంది.. మొన్న జరిగిన ఓ మీటింగ్లో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని చాలెంజ్ చేసిన జగన్, ఇప్పుడు వైజాగ్ మాత్రమే రాజధాని అని సూటిగా చెప్తున్నారు. అంటే ఎన్నికలకు ముందే టిడిపికి చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో మరి?!