Cinnamon Health Benefits: మన భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలకు ప్రధాన పాత్ర ఉంది. వీటిని మసాలా దినుసులు అని కూడా పిలుస్తారు. ఇందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వంటివి ఉన్నాయి. మన పూర్వీకులు వీటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇందులో దాల్చిన చెక్క ముఖ్యమైనది. ఆహారానికి రుచిని అందించడమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా ఇది దోహదపడుతుంది. ఆడవారి సౌందర్యరక్షణకు కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే దీనికి మనవారు అంతటి ప్రాధాన్యం ఇచ్చారు.
దాల్చిన చెక్కను చర్మంపై పూయడం వల్ల చికాకుతో పాటు చర్మం ఎర్రగా మారుతుందనేది అపోహే. దాల్చిన చెక్క శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయి. చర్మ వ్యాధుల నుంచి ఇది రక్షిస్తుంది. మొటిమల సమస్యలను కూడా నివారిస్తుంది. దీంతో దాల్చిన చెక్కను విరివిగా ఉపయోగించి ఎన్నో లాభాలు పొందవచ్చు. ఆయుర్వేదంలో దాల్చిన చెక్కతో మనం ఎన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చో తెలియజేస్తారు.
గుడ్డులోని తెల్లసొనను దాల్చిన చెక్క పొడితో కలిపి చర్మానికి రాసుకుంటే చర్మం బిగుతుగా అవుతుంది. శీతాకాలంలో దాల్చిన చెక్కను పెదవుల సంరక్షణ కోసం వాడుకోవచ్చు. పెట్రోలియం జెల్లిని చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి పెదాలపై రాసుకుంటే పగలకుండా ఉంటాయి. ముఖంపై మొటిమలు, మచ్చలను వదిలించుకోవడానికి దాల్చిన చెక్క పొడిని ఉపయోగించాలి. చర్మంపై ముడతలు రాకుండా ఉండాలంటే దాల్చిన చెక్క పొడిని వాడుకోవచ్చు. దాల్చిన చెక్క పొడిని పేస్టులా చేసి చర్మంపై పూసుకుని తరువాత టవల్ తో తుడుచుకుంటే ఫలితం ఉంటుంది.
ముఖంపై స్కిన్ పిగ్మెంటేషన్ సమస్య ఉంటే దాల్చిన చె్క పొడిలో పుల్లటి పెరుగు కలుపుకుని రాసుకుంటే చర్మంపై మచ్చలు రాకుండా చేస్తుంది. దాల్చిన చెక్కతో ఎన్నో లాభాలు ఉన్నాయి. దీంతో దీన్ని మనం వంటల్లోనే కాకుండా మన ఒంట్లోని జబ్బులకు కూడా దివ్య ఔషధంగా మారుతుంది. ఇన్ని లాభాలున్న దాల్చిన చెక్క మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. అందుకే దీన్ని వాడుకుని మన జబ్బులను దూరం చేసుకోవచ్చు. దాల్చిన చెక్క వల్ల ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుండటం వల్ల మనం దీన్ని వాడుకోవడం మానకూడదు.