Naresh And Pavitra Lokesh: 2022 డిసెంబర్ 31న నటుడు నరేష్ సంచలన ప్రకటన చేశారు. తాను నాలుగో వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. చాన్నాళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న పవిత్ర లోకేష్ మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నట్లు తెలియజేశాడు. ఈ పెళ్లి ప్రకటన కూడా చాలా రొమాంటిక్ గా చేశాడు. పవిత్ర లోకేష్ తో కలిసి ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో నరేష్-పవిత్ర లోకేష్ ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. లిప్ కిస్ చేసుకున్నారు. వీడియో బ్యాగ్రౌండ్ కూడా బహు గొప్పగా సెట్ చేశారు. ఆకాశంలో బాణాసంచా పేలుతూ ఉంటే ఆ వెలుగుల్లో నరేష్-పవిత్ర మైమరిచి ప్రేమించుకున్నారు.

నరేష్ ప్రకటన నేపథ్యంలో 2023లో ఆయన పవిత్ర లోకేష్ తో రిలేషన్ ని అధికారికం చేసుకోబోతున్నారని అందరూ భావిస్తున్నారు. అయితే అదేమీ లేదు, నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోవడం లేదు. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది అంటున్నారు. నరేష్ చేసిన ఈ పని ఓ మూవీ ప్రమోషనల్ లో భాగం అంటున్నారు. తమ చిత్రానికి ప్రచారం కల్పించడం కోసం నరేష్ రైట్ టైంలో జనాలను తప్పుదోవ పట్టించారన్న వాదన తెరపైకి వచ్చింది.
గతంలో నరేష్-పవిత్ర కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుందనే ప్రచారం జరిగింది. వారిద్దరి వాస్తవ జీవితాల ఆధారంగా ఓ ప్రేమ కథను నిర్మించాలని నరేష్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ చిత్రానికి ఆయనే నిర్మాత అని కథనాలు వెలువడ్డాయి. ఈ చిత్ర షూటింగ్ పనులు మొదలెట్టే ఆలోచనలో ఉన్న నరేష్ పెళ్లి పేరుతో ఒక వీడియో విడుదల చేశారు అంటున్నారు. కాబట్టి నరేష్-పవిత్ర వివాహం చేసుకోబోవడం లేదన్న కొత్త వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల మేటర్ సెటిల్ చేసుకున్న నరేష్ పెద్ద మొత్తంలో ఆమెకు భరణం చెల్లిచాడంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో నరేష్-పవిత్రల పెళ్లి మేటర్ రోజుకో ట్విస్ట్ తీసుకుంటుంది. కాగా నరేష్ రమ్య రఘుపతితో విడిపోయిన అనంతరం పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించిన నేపథ్యంలో పరిచయం పెరిగి, అది సహజీవనానికి దారి తీసింది. పవిత్ర లోకేష్, నేను కలిసి జీవిస్తున్నామని నరేష్ నేరుగా చెప్పారు. తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదని నరేష్ నేరుగా చెప్పిన నేపథ్యంలో ఆయన పెళ్లి ప్రకటనపై అనుమానాలు కలుగుతున్నాయి.