Chiranjeevi BholaaShankar : స్టీక్ ఆఫ్ శంకర్ ఫ్రమ్ భోళా శంకర్… చిరంజీవి శివరాత్రి ట్రీట్ కేక!
Mega Star Chiranjeevi BholaaShankar : స్టీక్ ఆఫ్ శంకర్ పేరుతో భోళా శంకర్ నుండి స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఢమరుకం పట్టుకొని శివతాండం ఆడుతున్న చిరంజీవి లుక్ అదిరిపోయింది. భోళా శంకర్ మూవీలో చిరంజీవి మీద గ్రూప్ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ సాంగ్ లోని చిరంజీవి స్టిల్ శివరాత్రి పురస్కరించుకుని విడుదల చేశారు. అలాగే ఫ్యాన్స్ కి పండగ శుభాకాంక్షలు చెప్పారు. భోళా శంకర్ మూవీకి మెహర్ రమేష్ దర్శకుడిగా ఉన్నారు. ఇది అజిత్ సూపర్ […]
Mega Star Chiranjeevi BholaaShankar : స్టీక్ ఆఫ్ శంకర్ పేరుతో భోళా శంకర్ నుండి స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఢమరుకం పట్టుకొని శివతాండం ఆడుతున్న చిరంజీవి లుక్ అదిరిపోయింది. భోళా శంకర్ మూవీలో చిరంజీవి మీద గ్రూప్ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ సాంగ్ లోని చిరంజీవి స్టిల్ శివరాత్రి పురస్కరించుకుని విడుదల చేశారు. అలాగే ఫ్యాన్స్ కి పండగ శుభాకాంక్షలు చెప్పారు. భోళా శంకర్ మూవీకి మెహర్ రమేష్ దర్శకుడిగా ఉన్నారు. ఇది అజిత్ సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేక్. 2015లో విడుదలైన ఆ చిత్రాన్ని తెలుగులో భోళా శంకర్ గా తెరకెక్కిస్తున్నారు.
చిరంజీవి నుండి మరో ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రానుంది. ఈ చిత్రంలో చెల్లెలు సెంటిమెంట్ హైలెట్ కానుంది. అందుకే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఒక ప్రక్క టాప్ స్టార్స్ తో జతకడుతూనే కీర్తి చెల్లెలు పాత్రలు చేయడం విశేషం. రజనీకాంత్ హీరోగా విడుదలైన పెద్దన్న మూవీలో కీర్తి ఆయన చెల్లెలు పాత్ర చేసిన విషయం తెలిసిందే. తమన్నా చిరంజీవికి జంటగా నటిస్తున్నారు. ఆయనతో తమన్నాకు ఇది రెండో చిత్రం గతంలో సైరా నరసింహారెడ్డిలో జతకట్టారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర భోళా శంకర్ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. భోళా శంకర్ చిత్రం మీద పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. సమ్మర్ కానుకగా భోళా శంకర్ విడుదలయ్యే సూచనలు కలవు. చాలా గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ చిరంజీవి మూవీతో ప్రేక్షకులను పలకరించాను. రఘుబాబు, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, రవి శంకర్, శ్రీముఖి కీలక రోల్స్ చేస్తున్నారు.
ఇక ఈ ఏడాదికి గానూ టాలీవుడ్ కి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ చిరంజీవి ఇచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. దర్శకుడు కే ఎస్ రవీంద్ర తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య మూవీలో చిరు మాస్ రోల్ లో బీభత్సం చేశారు. రవితేజ కీలక రోల్ లో తళుక్కున మెరిశారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందించారు. యంగ్ హీరోలు కూడా అందుకోలేనంతగా చిరంజీవి వరుస చిత్రాలు విడుదల చేస్తున్నారు. 2022లో రెండు చిత్రాలు విడుదల చేసిన చిరంజీవి, ఈ ఏడాది కూడా రెండు చిత్రాలతో ఫ్యాన్స్ ని పలకరించనున్నారు.