https://oktelugu.com/

Telugu Indian Idol: నిజంగానే ‘మెగా’ మనసు.. చిరంజీవిని ఇంత జోష్ లో ఎప్పుడూ చూడలేదు..

Telugu Indian Idol Chiranjeevi : టాలీవుడ్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చాడంటే ఆ గ్రేస్, క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన సెట్ లో చేసే సందడి.. తెరపై చేసే అల్లరి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఏదైనా రియాలిటీ షోకు వచ్చినప్పుడు సైతం చిరంజీవి అలాంటి సందడే చేస్తుంటారు. ఇదివరకూ బిగ్ బాస్ ఫైనల్స్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చి చిరంజీవి చేసిన హంగామా మనం అందరం చూసిందే. ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమైన ‘ఇండియన్ […]

Written By: NARESH, Updated On : June 18, 2022 4:51 pm
Telugu Indian Idol Chiranjeevi

Chiranjeevi

Follow us on

Telugu Indian Idol Chiranjeevi : టాలీవుడ్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చాడంటే ఆ గ్రేస్, క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన సెట్ లో చేసే సందడి.. తెరపై చేసే అల్లరి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఏదైనా రియాలిటీ షోకు వచ్చినప్పుడు సైతం చిరంజీవి అలాంటి సందడే చేస్తుంటారు. ఇదివరకూ బిగ్ బాస్ ఫైనల్స్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చి చిరంజీవి చేసిన హంగామా మనం అందరం చూసిందే. ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమైన ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ ఫైనల్ కు కూడా చిరంజీవి వచ్చి సందడి చేశాడు. షోను ఉర్రూతలూగించాడు. చిరంజీవిని ఇంత జోష్ గా.. కామెడీ టైమింగ్ లో ఎప్పుడూ చూడలేదంటే అతిశయోక్తి కాదేమో..

ఇండియన్ ఐడల్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరితో చిరంజీవి కలిసిపోయాడు.జడ్జీలపై జోకులు వేస్తూ.. గాయకులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఇస్తూ వారితో సరదాగా గడిపిన చిరంజీవి ఈ షో ఎంటర్ టైన్ మెంట్ ను పతాకస్తాయికి తీసుకెళ్లాడు. ఒక్కొక్క గాయకుడు పాడుతుంటే ఆ సందర్భానికి తగ్గట్టుగా వారితో చిరు కలిసిపోయిన వైనం అద్భుతమనే చెప్పాలి.

స్టేజీపై గాయకులే కాదు.. వారి తల్లిదండ్రులతోనూ చిరంజీవి సరదగా గడిపారు. వారి పాటలకు స్టెప్పులేశారు. వారితో కామెడీ చేశారు. ఇంత జోష్ గా చిరంజీవి ఎప్పుడూ కనిపించలేదనే చెప్పాలి. చిరంజీవి జోష్ తో ఇండియన్ ఐడల్ కు క్రేజ్ వచ్చింది. షోకు కళ వచ్చింది. ఈ కార్యక్రమం బిగ్ హిట్ కావడానికి దోహదపడింది.

మెగాస్టార్ ఎంట్రీకి యాంకర్ శ్రీరామచంద్ర ఇచ్చిన బూస్ట్.. తమన్ చిరంజీవి గురించి గొప్పగా చెప్పిన మాటలు.. మరో జడ్జి కార్తీక్ ‘ముఠా మేస్త్రీ’ సినిమా చూసిన అనుభవాలు, నిత్య మీనన్ నవ్వుకు చిరు ఫ్లాట్ అయిన సన్నివేశాలు ‘ఇండియన్ ఐడల్’లో హైలెట్ అయ్యాయి.

ఇక వీరే కాదు ప్రతి గాయకుడు పాడాక చిరంజీవి వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి ఫిదా చేశాడు. గాయకుడు శ్రీనివాస్ కు.. అతడికి కాబోయే భార్యను స్టేజీ మీదకు పిలిచి పెళ్లి పెద్దలా వ్యవహరించి పెళ్లి బట్టలు పెట్టి చిరంజీవి ఆశీర్వదించారు. స్టేజీపైనే వారికి భరోసా కల్పించారు.

ఇక మరో గాయని ప్రణతి పాటకు ఫిదా అయిపోయి ఆమె టాలీవుడ్ లో గొప్ప సింగర్ అవుతుందని.. ముందస్తుగానే తొలి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు చిరంజీవి. ఆమె కోరిక మేరకు ‘చూడాలని ఉంది’ సినిమాలోని ‘పద్మావతి’ డైలాగ్ చెప్పి అలరించారు.

నిత్య మీనన్ నవ్వుకు తాను పెద్ద ఫ్యాన్ అని.. ఆమె నవ్వుల వీడియోలను ప్రదర్శించి చిరంజీవి అందరినీ నవ్వించారు. ఆ నవ్వు అంటే చాలా ఇష్టమని.. అందరి ముందు తెరపై ప్రదర్శించారు.

Also Read: ORMAX Media Survey: ఎన్టీఆర్ ని వెనక్కినెట్టి దూసుకొచ్చిన ప్రభాస్, మహేష్… తాజా ర్యాంకింగ్స్ ఏంటంటే!

ఇక చిన్నప్పుడు తన కుమారుడు రాంచరణ్ తో రానా చేసిన చిలిపి పనిని ఇండియన్ ఐడల్ స్టేజీపై చెప్పి నవ్వులు పూయించాడు చిరంజీవి. రాంచరణ్, రానా ఇంటి కిటీకి గ్రీల్ తొలగించి ఇష్టానుసారం బయట ఆడుకొని వచ్చేవాళ్లని.. ఇక టెలిస్కోప్ ను చూడడానికి రానా వచ్చి  గ్రిల్ తొలగించాడని చిరంజీవి కామెడీ చేశాడు. దీనికి రానా  సిగ్గుపడుతూ ‘అన్నీ గుర్తున్నాయా? పరువు పోయిందే’ అని తలపట్టుకోవడం విశేషం.

గాయకుడు జయంత్ మాస్ పాటలకు ఫిదా అయిన చిరంజీవి.. అతడికి స్వయంగా కళ్లద్దాలు కానుకగా ఇచ్చి అలరించాడు చిరంజీవి. వాటిని పెట్టుకొని మరీ అందించారు. రజినీకాంత్ స్టైల్లో ఉన్నావయ్యా అంటూ జయంత్ ను మెచ్చుకున్నాడు.

-వాగ్దేవికి ఒక బంగారం కోటెడ్ అద్దాన్ని చిరంజీవి కానుకగా ఇచ్చాడు. ఈ క్రమంలోనే తమన్ ఏదీ టైం కు చేయడు అంటూ సెటైర్ వేశారు. ఇక వాగ్దేవి పర్ ఫామెన్స్ నచ్చి చాలా మంది ఉత్తరాలు పంపించగా.. ఓ చిలిపి లెటర్ ను చిరంజీవి చదివి నవ్వులు పూయించారు. ఎంతో అందంగా ఉన్న వాగ్దేవికి సినిమాల్లో అవకాశాలు వస్తాయని.. తనతో కలిసి నటించాలని అభ్యర్థించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా వాగ్దేవి తన అక్క వల్లే సింగర్ గా ఇందులోకి వచ్చానని.. ఆమె ప్రోత్సాహాన్ని మరువలేనని స్టేజ్ పైకి తీసుకొచ్చి చూపించింది. వాగ్దేవి పాటకు మెచ్చి జడ్జి కార్తీక్ ఆమెకు తన నెక్ట్స్ సినిమాలో పాడే అవకాశం ఇచ్చి చెక్ కూడా ప్రధానం చేశాడు.

– ఇక మరో గాయని వైష్ణవికి వాచీని గిఫ్ట్ గా ఇచ్చి స్వయంగా తన చేతులతో చిరంజీవి తొడిగాడు. చిరు ఇచ్చిన వాచ్ తో ఆమె దశ తిరుగుతుందని చెప్పాడు. అన్నట్టుగానే వాగ్దేవికి తమన్ ‘గాఢ్ ఫాదర్’లో ఒక పాట పాడేందుకు అవకాశం ఇవ్వడం విశేషం.

ఇలా మెగాస్టార్ ‘ఇండియన్ ఐడల్ వేదిక’పై దుమ్ముదుమ్ము రేపాడు. ఆయనకు 60 ఏళ్లు వచ్చినా ఆ జోష్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. చిరంజీవి ఊపుతో ఆ ప్రోగ్రాంకే కళ వచ్చినట్టైంది. ఇండియన్ ఐడల్ ఫైనల్ ను చిరంజీవి తన జోష్ తో పైకి తీసుకెళ్లాడనే చెప్పొచ్చు.

Also Read: Mahesh – Rajamouli Cinema: ఇక మొదలైనట్టే! మహేష్ – రాజమౌళి సినిమా గురించి అభిమానులకు చేదు వార్త