https://oktelugu.com/

నాగబాబుపై చిరు ట్వీట్.. నేనెప్పుడూ నీతోనే అన్న నాగబాబు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ.. మెగా హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి చూపినబాటలోనే ఆయన ఇద్దరు తమ్ముళ్లు.. కొడుకులు.. కూతుళ్లు.. బంధువులంతా నడుస్తున్నారు. సినీ పరిశ్రమలోనే వారంతా కొనసాగుతూ అభిమానుల మన్నలను పొందుతున్నారు. Also Read: ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సెట్‌లోకి సీత! చిరంజీవి తమ్ముడిగా.. మెగా బ్రదర్ గా.. నటుడిగా నాగబాబుకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. నేడు నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రెటీలు.. మెగా హీరోలంతా ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 / 01:27 PM IST
    Follow us on

    టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ.. మెగా హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి చూపినబాటలోనే ఆయన ఇద్దరు తమ్ముళ్లు.. కొడుకులు.. కూతుళ్లు.. బంధువులంతా నడుస్తున్నారు. సినీ పరిశ్రమలోనే వారంతా కొనసాగుతూ అభిమానుల మన్నలను పొందుతున్నారు.

    Also Read: ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సెట్‌లోకి సీత!

    చిరంజీవి తమ్ముడిగా.. మెగా బ్రదర్ గా.. నటుడిగా నాగబాబుకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. నేడు నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రెటీలు.. మెగా హీరోలంతా ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. అయితే నాగబాబుపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వారి మధ్య అనుబంధానికి అద్దంపట్టేలా ఉంది. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    ‘విధేయుడు.. ఎమోషనల్‌ పర్సన్‌.. దయగల హృదయమున్న వ్యక్తే కాదు.. చాలా సరదాగా ఉండే వ్యక్తి.. నా సోదరుడు నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మన బంధం.. అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని.. నీ ప్రతీ పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాన’ని నాగబాబు.. చిరంజీవి.. పవన్ కల్యాణ్ ఉన్న ఫొటోను మెగాస్టార్ ట్వీట్ చేశాడు.

    Also Read: షాకిచ్చిన పునర్నవి.. ఇలా చేస్తుందని అనుకోలేదు.!

    చిరంజీవి ట్వీట్ కు నాగబాబు సైతం రిప్లయ్ ఇచ్చాడు. ‘థాంక్స్‌ అన్నయ్య.. నేనెప్పుడూ నీతోటే ఉంటాను..’ అంటూ స్పందించాడు. అదేవిధంగా హీరో సాయితేజ్‌.. నిర్మాత బండ్ల గణేష్.. పలువురు సెలబ్రెటీలు, మెగా అభిమానులు నాగబాబుకి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.