
ధరణి వెబ్‌సైట్‌తో పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిపోతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేను రైతునేనని, భూముల విషయంలో ఎన్ని కష్టాలుంటాయో నాకు తెలుసన్నారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకునే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రెవెన్యూ చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయి కానీ ఏవీ ఉపయోగపడలేదన్నారు. ఇప్పటి తెలంగాణ రెవెన్యూ కొత్త చట్టంతో అనేక మార్పులు తీసుకొస్తుందన్నారు. భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్ ప్లేసులో ఉందన్నారు.