https://oktelugu.com/

China Woman: వీడియోలు చేస్తోంది.. వారానికి 120 కోట్లు సంపాదిస్తోంది: వైరల్

జెంగ్ జియాంగ్ అంతగా వీడియోలు చేసేది కాదు. అయితే ఇందులో కూడా దండిగా సంపాదించవచ్చు అని కొంతమంది ద్వారా తెలుసుకొని వీడియోలు పెట్టడం మొదలు పెట్టింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 8, 2024 / 07:56 PM IST

    China Woman

    Follow us on

    China Woman: ఇప్పుడంతా సోషల్ మీడియా కాలం. ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో, ఎందుకు అవుతారో ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో దాని ఆధారంగా సాగే వ్యాపారాలు కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాయి.. పుర్రె కో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్టు.. కొంతమంది ఈ సోషల్ మీడియాను ఉపయోగించి దర్జాగా వెనకేసుకుంటున్నారు. అది కూడా ఆషామాషీగా కాదు.. వీరిని సోషల్ మీడియా పరిభాషలో ఇన్ఫ్లుయనర్స్ గా పిలుస్తున్నారు. ఇప్పుడు మీరు చదవబోయే యువతి స్టోరీ కూడా అలాంటిదే. ఏదో సరదాకి సోషల్ మీడియాను వాడటం ప్రారంభించిన ఈమె.. ఏకంగా వారానికి 120 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగింది. ఇంతకీ ఎవరు ఈ యువతి? అంత సంపాదన ఎలా సాధ్యం? ఇంకా ఆలస్యమెందుకు చదివేయండి మరి.

    ఆ యువతి పేరు జెంగ్ జియాంగ్. పేరును బట్టి అర్థమయి ఉంటుంది మీకు ఆమెది చైనా దేశం అని. అక్కడ సోషల్ మీడియాలో టి యువతి చాలా పాపులర్. ప్రతివారం తన వీడియోల ద్వారా ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 120 కోట్లు సంపాదిస్తోంది. టిక్ టాక్ పై మన దగ్గర నిషేధం గాని.. చైనాలో కాదు. జెంగ్ జియాంగ్ తొలుత టిక్ టాక్ ను సరదాగా వాడటం ప్రారంభించింది. ఆ తర్వాత దానిపై సీరియస్ గా దృష్టి సారించి.. వినూత్నమైన వీడియోలు తీసి అప్లోడ్ చేయడం ప్రారంభించింది. ఆమె తీసిన వీడియోల్లో కొత్తదనం కనిపించడంతో చైనా ప్రజలు అనుసరించడం మొదలుపెట్టారు. దీంతో జెంగ్ జియాంగ్ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. లక్షల కొద్ది ప్రజలు ఆమెను అనుసరిస్తుండడంతో వివిధ రకాల కంపెనీలు ఆమెతో ఒప్పందం కుదుర్చుచుకున్నాయి. ఫలితంగా ఆమె తన వీడియోల్లో ఆ కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం మొదలు పెట్టింది.. ఇలా ఆమె వారానికి 120 కోట్లు సంపాదిస్తోంది. అన్నట్టు టిక్ టాక్ యాప్ లో ఆమెకు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

    మొదట్లో టిక్ టాక్ యాప్ లో
    జెంగ్ జియాంగ్ అంతగా వీడియోలు చేసేది కాదు. అయితే ఇందులో కూడా దండిగా సంపాదించవచ్చు అని కొంతమంది ద్వారా తెలుసుకొని వీడియోలు పెట్టడం మొదలు పెట్టింది. అందరిలా కాకుండా మెరుపు వేగంతో వీడియోలు పెట్టడం ప్రారంభించింది. అంతటివేగంలోనూ కొత్తదనం కనిపించడంతో చాలామంది ఆమెకు అభిమానులుగా మారిపోయారు. వాక్చాతుర్యంతో ఎంతటి కంపెనీ ఉత్పత్తినైనా జస్ట్ మూడు సెకన్లలో ప్రమోట్ చేస్తుంది. అంతేకాదు అనేక రకాల ఉత్పత్తులను తన వీడియోలో ప్రదర్శిస్తుంది. అందుకే ఆమెకు టిక్ టాక్ యాప్ లో ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఆమె వివిధ కంపెనీలకు సంబంధించి ఉత్పత్తులను ప్రమోట్ చేసే విధానం ర్యాపిడ్ ఫైర్ లాగా ఉంటుందని అక్కడి వీక్షకులు అభిప్రాయపడుతుంటారు. అదే తమను ఆకట్టుకుంటుందని వారు చెబుతుంటారు. జెంగ్ జియాంగ్ అలాంటి టెక్నిక్ ఉపయోగిస్తున్నందువల్లే మేము వ్యాపార సంబంధమైన ఒప్పందం కుదుర్చుకుంటున్నామని.. ఆమె తమ కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం వల్ల అమ్మకాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయని చైనా వ్యాపారులు చెబుతున్నారు. ఈ స్థాయిలో ఆర్జిస్తున్నప్పటికీ జెంగ్ జియాంగ్ డాబు దర్పం ప్రదర్శించకపోవడం వల్ల జెంగ్ జియాంగ్ కు అభిమానులు పెరుగుతున్నారు. కేవలం వ్యాపార సంస్థలకు సంబంధించిన ప్రకటనలు మాత్రమే కాకుండా.. సామాజిక, ధార్మిక సంస్థలకు సంబంధించిన ప్రకటనలను
    జెంగ్ జియాంగ్ చేస్తోంది. కాకపోతే వాటికి డబ్బులు తీసుకోదు. పైగా తన వంతుగా సహాయం కూడా చేస్తుంది.