
Pawan Kalyan: సరిగ్గా నాలుగేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ లో ఉన్నప్పుడు ఒక పాపని కలిసాడు..ఆ పాపకి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం.కానీ ఆ పాపకి కండరాల బలహీనత కి సంబంధించిన అరుదైన వ్యాధి సోకింది.అది ప్రాణాంతక వ్యాధి అనే విషయం కూడా ఆ బిడ్డకి తెలియదు.పవన్ కళ్యాణ్ ఆ చిన్నారిని కలవగానే ఆ బిడ్డ పడిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.
ఆరోజుల్లో ఆ వీడియో తెగ వైరల్ గా మారింది, పవన్ కళ్యాణ్ ఆ బిడ్డని దగ్గరకి తీసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ప్రేమగా మాట్లాడడం,ఆ తర్వాత ఆ చిన్నారి మీ కాళ్ళకి దండం పెట్టొచ్చా అని అడగడం చూసే ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించింది.ఆ చిన్నారి వైద్యానికి సంబంధించి అన్ని బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు.నాలుగేళ్ల నుండి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నాడు, కానీ ఆ చిన్నారి ఆయుష్షు ఇంతేనేమో, ఇటీవలే ఆ పాప కన్నుమూసిందట.
పవన్ కళ్యాణ్ ని కలిసిన రోజు తన కూతురుకి ఉన్న ఈ సమస్య గురించి చెప్పుకుంటూ చిన్నారి పద్మిని తల్లితండ్రులు వాపోయారు.వాళ్ళు పడుతున్న బాధని చూసి పవన్ కళ్యాణ్ మనసు చలించిపోయింది.ప్రతీ రోజు ఫిజియోథెరఫీ చేస్తే కానీ అమ్మాయి బ్రతకదు అని చెప్పడం తో పవన్ కళ్యాణ్ ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించాడు.
JanaSena Party Chief @PawanKalyan met Revathi to fulfill her dream & assured financial support to the family
Full Video : https://t.co/nYZjooTuDF pic.twitter.com/8SjFs590cU
— JanaSena Party (@JanaSenaParty) May 19, 2018
కానీ చికిత్స పొందుతూనే ఈ పాప కన్ను మూసింది.ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో చింతిస్తున్నారు.గతం లో పవన్ కళ్యాణ్ ఆ చిన్నారి తో ప్రేమగా మాట్లాడిన మాటలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఆ వీడియో ని మీరు కూడా ఒకసారి చూడండి.
