ChatGPT: వైద్యులకు అంతుపట్టని వ్యాధి.. చాట్ జీపీటీ కనిపెట్టింది.. ప్రాణం కాపాడింది..

అనారోగ్యంతో బాధపడుతున్న ఆ నాలుగేళ్ల అమెరికన్ కుర్రాడి అసలు సమస్య ఏమిటో మహా మహులే కనుక్కోలేకపోయారు.. పొందిన వైద్యులు కూడా చేతులెత్తేశారు.

Written By: Bhaskar, Updated On : September 13, 2023 11:54 am

ChatGPT

Follow us on

ChatGPT: చాట్ జీపీటీ.. ఈ కృత్రిమ మేథ వల్ల రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. భవిష్యత్తులోనూ దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చాట్ జిపిటి ద్వారా పలు సంస్థలు సులభంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కవిత రాయాలన్నా, వెబ్ పేజీ సృష్టించాలన్నా, ఎవరి మీదైనా వ్యాసం రాయాలన్నా.. ఇంకా రకరకాల పనులకు చాట్ జిపిటి అనేది ఒక వరంలాగా మారింది. అయితే అటువంటి కృత్రిమ మేథ అమెరికాలో ఒక చిన్నారి ప్రాణం కాపాడింది. అదేంటి ప్రాణం కాపాడాల్సింది వైద్యులు కదా..చాట్ జిపిటి ప్రాణాలు కాపాడటం ఏంటి అని అనుకుంటున్నారా! అయితే ఈ కథనం చదవండి.. మీకే అర్థమవుతుంది..

అనారోగ్యంతో బాధపడుతున్న ఆ నాలుగేళ్ల అమెరికన్ కుర్రాడి అసలు సమస్య ఏమిటో మహా మహులే కనుక్కోలేకపోయారు.. పొందిన వైద్యులు కూడా చేతులెత్తేశారు. రకరకాల వైద్య పరీక్షలు చేసినప్పటికీ కూడా అతడికి సోకిన వ్యాధి ఏమిటో కనుగొనలేకపోయారు. కానీ వారు ఎవరూ చేయలేని పనిని కృత్రిమ మేథ ఆధారంగా పనిచేసే చాట్ జిపిటి చేసి పెట్టింది. పంటి వైద్యులు, నరాల వైద్యులు.. ఇలా 17 రకాల స్పెషలిస్టుల చుట్టూ తిరిగినా అర్థం కాని ఆ బాలుడి అనారోగ్యం గుట్టును ఓ మహిళ కృత్రిమ మేథ సహాయంతో కనిపెట్టింది. అమెరికాలోని కోర్ట్ నీ అనే మహిళకి అలెక్స్(4) ఒక కుమారుడు ఉన్నాడు. పంటి నొప్పి, పొడవు పెరగకపోవడం, తలనొప్పి వంటి అనేక రకాల సమస్యలతో అతడు బాధపడుతున్నాడు. తన కుమారుడి బాధ చూడలేక
కోర్ట్ నీ ఆమె 17 మంది వైద్యులకు చూపించింది. రకరకాల వైద్య పరీక్షలు చేసినప్పటికీ బాలుడి అసలు సమస్య ఏమిటనేది వారెవరు కచ్చితంగా గుర్తించలేకపోయారు.

తన కుమారుడి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతుండటంతో కోర్ట్ నీ ఆందోళన చెందింది. దీంతో తన కుమారుడి సమస్యలను.. వివిధ రకాలైన పరీక్ష నివేదికలను ఒకరోజు ఇన్ ఫుట్ గా చాట్ జిపిటికి సమర్పించింది. బాలుడు అసలు సమస్య ఏమిటని చాట్ జిపిటిని ప్రశ్నించింది. దీనికి కొంత సమయం తీసుకున్న చాట్ జిపిటి ఆ బాలుడికి ” టెదర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్” అనే అరుదైన నరాల సంబంధిత సమస్యతో అలెక్స్ బాధపడుతున్నాడని సూచించింది. ఆ మేరకు మరో మారు నరాల వ్యాధుల నిపుణుల వద్దకు వెళ్లి, వ్యాధి తాలూకూ గుర్తింపు పరీక్షలను కోర్ట్ నీ చేయించింది. చాట్ జిపిటి చెప్పింది నిజమే అని పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత తేలింది. దీంతో అక్కడి వైద్యులు ఆ బాలుడికి శస్త్ర చికిత్స నిర్వహించారు. వెన్నెముకలో కండరాల కదలికలు సరిగ్గా లేకపోవడం వల్ల నరాల సమస్య తలెత్తడాన్ని ” టెదర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్” గా వైద్యులు వ్యవహరిస్తారు. ప్రస్తుతం అలెక్స్ ఆసుపత్రిలో కోరుకుంటున్నాడు.