Charles Sobhraj Released: కరుడుగట్టిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్(78)ను జైలు నుంచి విడుదల కానున్నాడు. వయోభారం, అనారోగ్య కారణాలు దృష్ట్యా నేపాల్ సుప్రీంకోర్టు అతడిని విడుదల చేయాలని ఆదేశించింది..చార్లెస్ కు వ్యతిరేకంగా పెండింగ్ కేసులు లేకపోవడంతో విడుదల చేసి 15 రోజుల్లో అక్కడిని స్వదేశానికి పంపాలని నేపాల్ సర్వోన్నత అధికారులకు సూచించింది.. చార్లెస్ శోభరాజ్ ను 2003లో నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నేపాల్ సుప్రీంకోర్టు అతడికి 21 సంవత్సరాలు పాటు జైలు శిక్ష విధించింది. దీంతో అప్పటినుంచి అతడు నేపాల్ నేపాల్ జైలు లో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష అనుభవించి 20ఏళ్ళు పూర్తి కావడం, వయోభారం కారణంగా అతడిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తెలిపారు.

-కరడు కట్టిన కిల్లర్
చార్లెస్ శోభరాజ్ కరడు కట్టిన కిల్లర్. ఢిల్లీలోని ఓహోటల్ లో 1976లో ఓ ఫ్రెంచ్ పౌరుడికి విషం ఇచ్చి చంపిన కేసులో అరెస్టు అయ్యాడు.. 1997 వరకు భారత్ లోని వివిధ జైళ్లల్లో శిక్ష అనుభవించాడు..విడుదలయ్యాక హత్యలు, దోపిడీలకు పాల్పడ్డాడు.. ఈ క్రమంలో నేపాల్ లో హిప్పీల ను దోపిడీ చేశాడు. దీంతో అక్కడి పోలీసులకు దొరికిపోయాడు.. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు.. భారత్, నేపాల్ మాత్రమే కాదు…యూరప్, ఇరాన్, గ్రీస్ వంటి దేశాల్లో కూడా చార్లెస్ శోభరాజ్ నేరాలకు పాల్పడ్డాడు. దొంగతనాలు చేసి ఆ సొమ్ముతో జల్సాలు చేసేవాడు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 20 మందిని హతమార్చాడు. తన అనధికారికంగా ఈ లెక్క ఎక్కువే ఉంటుంది.. ఇండియాలో శిక్ష అనుభవించిన తర్వాత పాశ్చాత్య దేశాలకు పారిపోయాడు.. అక్కడ ఒక సెలబ్రిటీ హోదా అనుభవించాడు.. చాంటాల్ కాంపాగ్నాన్ అనే యువతీకి దగ్గరయ్యాడు.. అంతకుముందు చాలామందితో సంబంధాలు నెరిపాడు. చాంటాల్ కాంపాగ్నాన్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఉష అనే అమ్మాయి పుట్టింది. చార్లెస్ శోభ రాజ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో సినిమాలు కూడా వచ్చాయి. మొదట్లో చార్లెస్ నేరాల్లో భాగస్వామిగా ఉన్న అతడి సతీమణి.. తర్వాత అతడిని వదిలిపెట్టి పోయింది. ఎప్పుడైతే ఆమె వదిలిపెట్టి పోయిందో చార్లెస్ మరింత రెచ్చిపోయాడు. విపరీతమైన నేరాలకు పాల్పడ్డాడు.

హాత్ చంద్, ట్రాన్ లోవాంగ్ ఫున్ దంపతులకు చార్లెస్ శోభరాజ్ జన్మించాడు.. ఇతడు పుట్టాక కొన్ని సంవత్సరాలకే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. శోభరాజ్ తల్లి వియత్నాం మూలాలున్న మహిళ. విడాకులు అనంతరం ఆమె ఒక ఫ్రెంచ్ యువకుడికి దగ్గరయింది.. మొదట్లో చార్లెస్ శోభ రాజ్ ను అతని పెంపుడు తండ్రి బాగానే చూసుకునేవాడు. తని తర్వాత వారికి పిల్లలు పుట్టడంతో ఇతని దూరం పెట్టడం మొదలుపెట్టారు.. ఇంకా అప్పటినుంచి చార్లెస్ శోభరాజ్ మానసిక పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. చదువు సంధ్యా లేకుండా బలాదూర్ గా తిరిగేవాడు. అలా నేరగాళ్ళతో పరిచయం పెంచుకొని కరుడుగట్టిన సీరియల్ కిల్లర్ గా మారాడు. అతడు చేసిన హత్యలకు గానూ బికినీ కిల్లర్ అని పిలుస్తుంటారు.