spot_img
Homeఆంధ్రప్రదేశ్‌K. A. Paul: చంద్రబాబును అరెస్టు చేయాలంట.. కేఏ పాల్ నువ్వు సూపరహే

K. A. Paul: చంద్రబాబును అరెస్టు చేయాలంట.. కేఏ పాల్ నువ్వు సూపరహే

K. A. Paul: మీడియా, సోషల్ మీడియా అతడిని కామెడీ పీస్ చేశాయి. కానీ ఒక్కోసారి అతని ఆలోచనా విధానం చాలా బాగుంటుంది. నెగిటివ్ థాట్ ను దరిదాపులకు కూడా రానివ్వడు. నిన్న జరిగిన కందుకూరు ఘటనలో మొట్టమొదటిసారి నోరు విప్పింది కూడా తనే. చంద్ర బాబు నాయుడుని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది కూడా తనే. ఇప్పటికి కూడా అదే స్టాండ్ పై అతడు నిలబడి ఉన్నాడు.. నిండా 4000 మంది పట్టని ఒక మైదానంలో.. 50 వేల మందితో సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నాడు. అతడే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్.

K. A. Paul
K. A. Paul

అరెస్టు చేయాలి

కే ఏ పాల్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగాడు. వాస్తవానికి అతడి ఎదుగుదలలో చంద్రబాబు పాత్ర కూడా ఉంది.. కానీ ఇదే సమయంలో తన విధేయతను చాటుకున్న పాల్… బహిరంగ వేదికలో మాత్రం న్యూట్రాలిటీకే ప్రాధాన్యమించాడు.. జగన్ ను ఎంత తిడతాడో.. చంద్రబాబును కూడా అదే స్థాయిలో విమర్శిస్తాడు. కానీ ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే చంద్రబాబును తనతో కలిసిపోమంటాడు. పవన్ కల్యాణ్ ను తనకు మద్దతు ఇవ్వమంటాడు. మొత్తానికి ఇక్కడే కామెడీ పీస్ అయిపోతాడు. తాను నవ్వకుండానే నవ్వుల పాలవుతాడు. తన చేష్టలతో నాటకాల్లో జోకర్ ను మరిపిస్తాడు.

K. A. Paul
K. A. Paul

పోలీసులకు ఫిర్యాదు చేశాడు

కేవలం చంద్రబాబు మీద విమర్శలు లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేఏ పాల్ ఫిర్యాదు చేశాడు. చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశాడు. అంతమందితో సభ నిర్వహించే అనుమతి చంద్రబాబుకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించాడు. తాను అధికారంలోకి వస్తే ఇలాంటి సభలు, సమావేశాలు నిర్వహించే అవకాశం ఇవ్వబోనని స్పష్టం చేశాడు. పార్టీకి గుర్తింపు లేదు.. ఇంతవరకు ఒక్క ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. కానీ కే ఏ పాల్ ధీమా మామూలుగా లేదు. ఒక్క శాతం కూడా నెగిటివిటీని తన దరిదాపుల్లోకి కూడా రానివ్వని పాల్ ఆత్మ విశ్వాసాన్ని చూస్తుంటే సూపర్ అనకుండా ఉండలేం. కేఏ పాల్.. మొత్తానికి నువ్వు సూపరహే!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version