
Chanakya Niti Problems: ప్రతి మనిషి జీవితంలో కష్టాల పాలు కావడం సహజమే. విద్య, వ్యాపారం, ఉద్యోగం ఏదైనా సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం కామనే. ఈ నేపథ్యంలో సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పలు పాట్లు పడుతుంటారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన సూచనల ప్రకారం సమస్యలు ఎదుర్కొని తనదైన శైలిలో పరిష్కరించుకునే విధానాలు అవలంభించాలి. అప్పుడే మనకు సమస్యల బారి నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
సహనం
సహనం ఉన్న వ్యక్తి సమస్యలను సరైన విధంగా పరిష్కరించుకుంటాడు. పొలం చెడిపోయిందని కొడవలి పారేసుకునే వాడు నిరాశావాది. ఆశావాది అయిన వాడు ఆ పొలంలో ఎంతో కొంత ధాన్యం సంపాదించుకోవాలని చూస్తాడు. ఆచార్య చాణక్యుడు కూడా అదే చెబుతున్నాడు. ఓపికతో మనకు ఎదురయ్యే సమస్యల నుంచి ఎలా బయటపడాలని ఉపాయాలు ఆలోచిస్తాడు. అందుకు అనుగుణంగా పరిష్కార మార్గాలు కూడా ఆలోచిస్తాడు. సమస్యను ఎలా దూరం చేసుకోవాలో కూడా తెలుసుకుంటాడు.
వ్యూహాలు
సరైన వ్యక్తి సమస్య నుంచి తప్పించుకోవడానికి వ్యూహాలు రచిస్తాడు. ఎలాంటి సమస్యకు ఏ పరిష్కార మార్గం ఆలోచించాలనే విధంగా వ్యూహాలకు పదును పెడతాడు. చిన్న సమస్యనైనా పెద్ద కర్రతో కొట్టాలనే నానుడి ప్రకారం తన మెదడులో వచ్చే ఆలోచనలకు కార్యరూపం కల్పిస్తాడు. ఫలితంగా సమస్య నుంచి వచ్చే అడ్డంకులను ఎదుర్కొంటాడు. చక్కనైన పరిష్కార మార్గాలతో సమస్యను దూరం చేసుకుని మంచి జీవితాన్ని అనుభవించేందుకు రెడీగా ఉంటాడు.
ధైర్యం
సమస్య ఎదురైనప్పుడు పారిపోయేవాడు పిరికివాడు. ఎదురు నిలిచే వాడు ధైర్యవంతుడు. మనిషికి ధైర్యమే కొండంత అండ. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా నిగ్రహంగా ఉండేవాడే ధీరుడు. అంతేకాని కొందరు సమస్య వచ్చిందని ఆత్మహత్య చేసుకునేందుకు కూడా వెనుకాడం లేదు. ఇది పిరికి వారి చర్య. దైర్యంగా ఉండే వాడు ఎన్ని సమస్యలనైనా ఇట్లే పరిష్కరించుకుంటాడు. చేపట్టిన పనిని సక్సెస్ ఫుల్ గా చేసేందుకు అనుకూల పరిస్థితులు సృష్టించుకుంటాడు. ఇలా ధైర్యవంతుడుగా ఉండాలి.

భయం
ఆచార్య చాణక్యుడి ప్రకారం మనిషికి భయం ఉండకూడదు. అది బలహీనున్ని చేస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమస్యలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. అందుకే భయం ఎప్పుడు కూడా మనిషిని చుట్టుముట్టకూడదు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ధైర్యమే ఆభరణంలా పనిచేస్తుంది. భయాన్ని జయించిన వాడికే విజయాలు దక్కుతాయి. ప్రతి సమస్యను సులభంగా పరిష్కరించుకునే మార్గాలు అన్వేషించుకుంటే సరి. బలహీనతకు లొంగిపోయి సమస్యల్లో చిక్కుకుంటే ప్రమాదమే. ఆచార్య చాణక్యుడు మనకు సూచించిన విధానాలు ఎప్పటికి మనకు ఆచరణీయమే.