
Devita Saraf: నేటి కాలం మహిళలు వంటింటికే పరిమితం అనుకోవడం లేదు. దేశాలనే ఏలే స్థాయికి ఎదుగుతున్నారు. రంగం ఏదైనా అందులో తమ పాత్ర కోసం పురుషులతో పోటీ పడుతున్నారు. అయితే వ్యాపారాల్లో మహిళలు రాణించడం కత్తిమీద సాము లాంటిదే. అయినా చాలా మంది ఎన్నో కష్టాలను ఎదుర్కొని విజయం సాధించారు. ఈ గెలుపు అందడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ 24 వయసులోనే ఓ యువతి కంపెనీకి చైర్మన్ అయ్యారు. అంత చిన్న వయసులోనే 1000 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నారు. ఈమె కృషిని చూసిన ఫార్య్చూన్ ఇండియా 50 మంది అత్యంత శక్తివంతమైన మహిళలల్లో ఆమె పేరు చేర్చారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె స్టోరీ ఏంటీ?
భారతీయ టీవీల విభాగాల్లో వీయూ(Vu) హవా నడుస్తోంది. ఈ కంపెనీకి చెందినవి అత్యధికంగా అమ్ముడు పోతున్నాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ఇవి 30 లక్షల టీవీలు అమ్ముడుపోయాయి. అందుకు ఈ కంపెనీ గ్రూప్ చైర్మన్, సీఈవో దేవితా సరాఫ్ కృషే కారణం. దేవితా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో స్టడీ చేశారు. ఆ తరువాత ఫ్యాషన్, మోడల్ రంగంలోకి అడుగుపెట్టారు. కానీ బిజినెస్ స్టడీ చేసినందున వ్యాపార రంగంలో రాణించాలన్న పట్టుదల ఆమె మదిలో ఆలోచన మొదలైంది.
దీంతో దేవితా సరాఫ్ 2021లో ‘డైనమైట్ బై దేవితా సరాఫ్’ అనే ఫెర్ఫ్యూమ్ ను ప్రారంభించారు. దీనిని మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. అయితే ఈ సమయం కోవిడ్ అయినందున కంపెనీకి వచ్చిన ఆదాయాన్నంతా విరాళంగా పంచిపెట్టారు. ఆ తరువాత కాలిఫోర్నియాలో యూవీ గ్రూప్ ను స్థాపించారు. ఇది హై- ఎండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో అగ్రగామిగా చేరింది. ఈ కంపెనీని స్థాపించిన ఆమె ఇప్పటి వరకు 30 లక్షల టీవీలను విక్రయించారు. వీటి ద్వారా ఆమె 1000 కోట్ల ఆదాయాన్ని పొందారు.

ప్రస్తుతం దేవితా సరఫ్ నికర ఆస్తి విలువ రూ.1800 కోట్లు. హరున్ రిపోర్ట్ 2020 ప్రకారం.. ఇండియాలో స్వయం శక్తితో ఎదిగిని 40 ఏళ్లలోపు మహిళల్లో దేవితా నిలిచారు. ఆమెను ఫోర్బ్స్ ‘ఇండియా మోడల్ సీఈవో’గా ఎంపిక చేశారు. ఒడిస్సీ డ్యాన్సర్ అయిన ఆమె అంతర్జాతీయ హై ఐక్యూ మెన్సా సొసైటీలో సభ్యురాలు కూడా. వాల్ స్ట్రీట్ జర్నల్ కోసం రెండు సంవత్సరాల పాటు ఓపెడ్ కాలమ్స్ ను కూడా రాసింది. నాయకత్వం, వ్యవస్థాపకత, ఆవిష్కరణ వంటి విషయాలపై ఆమెకు పట్టుఉంది.