Bandi Sanjay Son Controversy: రాజకీయ నేతల పిల్లలు, కుటుంబ సభ్యులపై రాజకీయాలు చేసే సంస్కృతి ఇటీలికాలంలో పెరుగుతోంది. గతంలో మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు శరీరాకృతిపై కొంతమంది కామెంట్స్ చేయడం పెద్ద దుమారమే లేపింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారం క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. సంజయ్ కుమారుడు భగీరథ ‘మహీంద్రా వర్సిటీ’కి చెందిన విద్యార్థిపై దాడి చేసినట్లు విశ్వవిద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

–పాత ఘటనపై తాజాగా ఫిర్యాదు..
మహీంద్రా వర్సిటీలో భగీరథ్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు. ఇటీవల శ్రీరామ్ అనే విద్యార్థిని దూషించడంతోపాటు దాడి చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాలేజీ ప్రాంగణంలోనే ఈ దాడి జరిగినట్లు ఆ వీడియోలో ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ ఘటనపై తాజాగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. దీనివెనుక రాజకీయ ప్రమేయం, అధికార పార్టీ ప్రేరేపితం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన ఘటనపై విశ్వవిద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు తాజాగా ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. క్రమశిక్షణా సంఘం ఫిర్యాదు మేరకు ఐపీసీ 341, 322, 504, 506, 34 సెక్షన్ల కింద బండి భగీరథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ డీసీపీ సందీప్‌రావ్ వెల్లడించారు. మహీంద్రా యూనివర్సిటీ ఇచ్చిన ఆధారాల ప్రకారం కేసు విచారణ జరుపుతామని తెలిపారు.
–సోషల్ మీడియాలో దాడి వీడియో..
వర్సిటీలో జరిగిన దాడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావాలనే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి భగీరథ్‌ను ఇరికించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాత వీడియోను ఇప్పుడు బయటపెట్టారంటూ బాధిత విద్యార్థి శ్రీరామ్ పేర్కొనడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాను భగీరథ, ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ అని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ శ్రీరామ్ చెప్పడం గమనార్హం.

–స్పందించిన బండి సంజయ్..
భగీరథ్‌పై పోలీసు కేసు నమోదు చేసిన విషయమై బండి సంజయ్ ఢిల్లీలో స్పందించారు. తన కుమారుడు తప్పుచేస్తే ఏ శిక్ష అయినా విధించొచ్చని పేర్కొన్నాడు. రాజకీయం కోణం ఉంటే మాత్రం అమాయకులను ఇబ్బంది పెట్టొద్దని, విద్యార్థుల భవిష్యత్ నాశనం చేయొద్దని సూచించారు. తన కొడుకు తప్పు చేస్తే తాను కూడా మద్దతు చెప్పనని స్పష్టం చేశారు.
క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటున్న ఈ కేసు బాధితుడి స్టేట్‌మెంట్‌తో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది
Shocking that it comes from the son of Bandi Sanjay ji . Of course he cannot be held responsible for what his good for nothing son does , but is hubris becoming the problem of bjp ??? https://t.co/iAySGifnPD
— kishore k swamy 🇮🇳 (@sansbarrier) January 17, 2023
https://www.youtube.com/watch?v=ynMkJJhBmXw