AP Vande Bharat Express: ఎరక్క పోతే.. ఇరుక్కు పోక తప్పదు. ఈ సామెత ఈ పెద్ద మనిషి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది. ఆయన చేతి మీదుగా ₹6,000 జరిమానా కట్టించేందుకు కారణమైంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మొన్న సంక్రాంతి నాడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వందే భారత్ రైలు ను ప్రారంభించారు. సకల సౌకర్యాలను ఈ రైలులో ఏర్పాటు చేయడంతో ప్రయాణం చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు.. ఇది చూసేందుకు చిన్నపాటి విమానంలా కనిపించడంతో చాలామంది సెల్ఫీలు దిగారు.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకున్నారు.. ఇక్కడ వరకు అంత బాగానే ఉంది.. కానీ అత్యుత్సాహానికి పోయిన ఓ పెద్దమనిషి వందే భారత్ రైలు బోగిలోకి ఎక్కాడు. ఎక్కిన వెంటనే రైలు డోర్ లాక్ అయింది.. ఇంకేముంది బండి వేగం పుంజుకుంది.

6000 అపరాధ రుసుం విధించారు
బండి వేగం పుంజుకున్న తర్వాత రైల్వే బోగి ల్లో ఉన్న సిబ్బంది వచ్చారు. అతడి వాలకం చూసి ఏంటి అని అడిగితే జరిగింది మొత్తం చెప్పాడు. మొదట్లో విసుకున్న అధికారులు… ఆ తర్వాత నవ్వడం మొదలుపెట్టారు.. ఈ లోపు ఆ పెద్దమనిషి రైలు డోరు తీసేందుకు ప్రయత్నించాడు.. కానీ అది ఎంతకీ రాలేదు. అతడు వ్యవహరిస్తున్న తీరు చూసి నవ్వుకున్న రైల్వే సిబ్బంది 6000 పైన్ విధించారు. అంతేకాదు టికెట్ లేకుండా వందే భారత్ రైలు అయితే చేతి చమురు వదిలిస్తామని హెచ్చరించారు. ఏదో సెల్ఫీ కోసం బోగి ఎక్కితే ఆ పెద్దమనిషి కి తత్వం బోధపడింది. సోకులకు పోతే షాక్ లు తప్పవని అర్థమైంది. ఇప్పుడు ఆ పెద్దమనిషి రైల్వే సిబ్బందితో జరిపిన సంభాషణ తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.