
Ramcharan – Bunny : మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. వీరంతో మెగాస్టార్ స్టైల్లోనే సినిమాల్లో నటిస్తూ చిరంజీవి పేరును నిలబెడుతున్నారు. అయితే ఈ మధ్య అల్లు అర్జున్ మెగా హీరోలను పొగడడం మానేశారు. ఇతర కార్యక్రమాల్లోనూ అల్లు బ్రాండ్ ను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇక తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా బన్నీ ఆయనకు విషెష్ చెప్పలేదు. కానీ ఒకరోజు ఆలస్యంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ సందర్భంగా బన్నీ ఇలాగే ప్రవర్తించారు. ఆస్కార్ వచ్చిన ఒకరోజు తరువాత కంగ్రాట్స్ చెప్పారు. దీంతో వీరి మధ్య విభేదాలున్నాయా? అన్న చర్చలు ప్రారంభమయ్యాయి.
పుష్ప బ్లాక్ బస్టర్ కొట్టిన తరువాత బన్నీ ఫోకస్ అంతా పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఏం జరిగినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ పాత్ర కూడా ఎంతో ఉంది. దీంతో ఆయనను మెగా హీరోలంతా పొగడ్తలతో ముంచెత్తారు. అయితే బన్నీ మాత్రం ఆయనను కంగ్రాట్స్ చెప్పడానికి ఒకరోజు టైం తీసుకున్నారు. అవార్డు వచ్చిన ఒకరోజు తరువాత రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడు రామ్ బర్త్ డే సందర్భంగా మెగా హీరోలతో పాటు ఇతర నటులు ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. నిన్న ఆయన బర్త్ డే వేడుకలు ఆడంబరంగా జరిగాయి. అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదని తెలుస్తోంది. రామ్ చరణ్ కు బర్త్ డే విషెష్ చెప్పలేదు. అయితే ఇక్కడ కూడా ఒకరోజు గడిచిన తరువాత ఆయనకు శుభాకాంక్షలు తెలపడం ఆసక్తికరంగా మారింది. ఇలా బన్నీ ఏ వేడుకకైన ఒకరోజు ఎందుకు తీసుకుంటున్నారన్న చర్చ ప్రారంభమైంది.
అంతకుముందు బన్నీ సినిమాల్లో ఎక్కడో ఒక చోట మెగా హీరో చిరంజీవి పేరు తీసుకొచ్చేవారు. కానీ గత నాలుగైదు సినిమాల్లో మెగా పేరు వినిపించడం లేదు. కానీ ఇదే సమయంలో అల్లు పెద్దలను స్మరిస్తున్నారు. సొంత కుటుంబాన్ని ప్రమోట్ చేయడం వల్ల మెగా కుటుంబాన్ని బన్నీ పట్టించుకోవడం లేదా? అని అనుకుంటున్నారు. గత సంక్రాంతి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఏర్పడిందని అంటున్నారు. అందుకే కొన్ని కార్యక్రమాలకు ఇరువురు ఒకచోట కనిపించడం లేదని చర్చించుకుంటున్నారు.