Samantha: మన సమాజంలో నాలుగో ఎస్టేట్ గా ఉన్న మీడియాకు పట్టపగ్గాల్లేవు. ఎదైనా జరిగితే ఉన్నది లేనిది కల్పించి అభూతకల్పనలు, అవాస్తవాలతో ప్రముఖుల బట్టలిప్పి నడిబజారున నిలబెట్టేలా కథనాలు వల్లే వేస్తుంటారు. యూట్యూబ్ చానెళ్లు అయితే మరీ దిగజారిపోయాయి. థంబ్ నేల్స్ తో హెడ్డింగులతో సెలబ్రెటీల పరువు తీస్తున్నాయి. దీనిపై సినీ ప్రముఖులు నెత్తినోరు బాదుకొని మీడియాతో పెట్టుకోవడానికి భయపడి మిన్నకుండిపోతారు. కానీ అందరూ అలా ఉండరు. కొందరు మొండి వారు ఉంటారు. వారిలో ఒకరే సమంత. తాజాగా తన విడాకుల విషయంలో అభాసుపాలు చేసిన యూట్యూబ్ చానెళ్లపై సమంత కోర్టుకెక్కారు. కేసులు పెట్టారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన చిన్నా చితకా యూట్యూబ్ చానెల్స్ అన్నీ కూడా సెలబ్రెటీలపై పడి వారిని వీధిన పడేసేలా కథనాలు అల్లుతుంటాయి. సమంత విడాకుల విషయంలో సోషల్ మీడియా, మీడియాలో లెక్కలేనన్ని అసత్యప్రచారాలు చేశారు. ఇక చివరకు ఎవరో వైద్యుడు చెప్పిన పిచ్చి మాటలను కూడా రాసేశారు. సమంత గర్భం మీద అసత్యాలు రాశారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు.
అలా తన మీద వచ్చిన లెక్కలేనన్ని రూమర్ల మీద సమంత ఆగ్రహం వ్యక్తం చేసి సోషల్ మీడియాలో ఖండించింది. అయితే బాగా దారుణంగా విమర్శలు చేసిన యూట్యూబ్ చానెళ్లపై కోర్టుకెక్కింది. ఇటీవల తప్పుడు కథనాలు రాసిన మూడు యూట్యూబ్ చానెళ్లకు సమంత కోర్టు నోటీసులు పంపించింది. మూడు యూట్యూబ్ చానెళ్లను కోర్టుకు ఈడ్చింది.
అందులో ప్రముఖ యూట్యూబ్ చానెల్ ‘బీఎస్ టాక్ షో’ కూడా ఉంది. ఆన్ లైన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీఎస్ టాక్ షో ఫేమ్ ‘బుర్ర శ్రీనివాస్ ’ ఈవిషయం మీద స్పందించారు. సమంత వేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని వేడుకున్నాడు. కేసులు వేయడం మంచి పద్దతి కాదన్నారు. సోషల్ మీడియా సామాన్యుడి ఆయుధమని..దానిపై నోటీసులు కేసులు భావ్యం కాదన్నారు. అభ్యంతరకరంగా ఉంటే దాన్ని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వెంటనే కేసును వెనక్కి తీసుకోవాలని సమంతను వేడుకున్నాడు.
వీడియో వైరల్
