Bigg Boss 5 telugu: బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలీదు. స్నేహితులు గా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా బద్ధ శత్రువులుగా మారుతారు. ఒకరినొకరిని తిట్టుకుంటూ ఉండేవాళ్ళు కూడా మిత్రులవుతారు. అలా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేము. అయితే తాజాగా కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ కి సంబంధించి బిగ్ బాస్ జెస్సీ కి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఆ సీక్రెట్ టాస్క్ ఇప్పుడు ‘ త్రిమూర్తులు’ అయిన షన్ను, సిరి, జెస్సి ల మధ్య పెద్ద కుంపటి అంటి పెట్టింది. గేమ్ పరంగా జెస్సీ, సిరి ఇద్దరు షణ్ముఖ్ ని సైడ్ చేసారని భావించి మదన పడుతున్నాడు షన్ను. ఇంతకీ ఏం జరిగిందంటే…!

ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ సంబంధించిన బంగారు ‘కోడిపెట్ట టాస్క్’ రెండు రోజుల నుండి కొనసాగుతుంది. అయితే ఈ టాస్క్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య పెద్ద దుమారమే లేపింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో జెస్సీ – సన్నీ, ప్రియా – సన్నీ, కాజల్ – ప్రియా మధ్య జరిగిన గొడవ రక్తికట్టింది. ఈ వాగ్వాదం లో కాజల్ కంటతడి పెట్టడం ఒక ఎత్తు అయితే కాజల్ – సన్నీ సంభాషణలో మానస్ ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ ఉన్నది మనుషులు.. ఇన్ స్టాంట్ నూడిల్స్ కాదు వెంటనే చేంజ్ అవ్వడానికి కాస్త టైం ఇవ్వు అంటూ కాజల్ మీద ఫైర్ అవ్వడం ఒక ఎత్తు.
ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే .. టాస్క్ సందర్భంగా బిగ్ బాస్ జెస్సీ కి ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. వేరే వ్యక్తి సహాయం కూడా తీసుకోవచ్చు అని బిగ్ బాస్ అనగా .. సిరి ని ఎంచుకుంటాడు జెస్సీ. అయితే ఈ సీక్రెట్ టాస్క్ లో భాగం గా జెస్సీ.. ప్రియా, ప్రియాంక, షన్ను దగ్గర ఉన్న గుడ్లన్నీ ఇస్తారు జెస్సీ కి.
అయితే ఇవ్వాళ జరిగే ఎపిసోడ్ లో త్రిమూర్తులకు పెద్ద షాకే తగిలినట్టు అనిపిస్తుంది. సీక్రెట్ టాస్క్ లో జెస్సీ పూర్తిగా విఫలమైనట్టు.. ఈ విషయం తెల్సి షణ్ముఖ్ తెగ ఫీలైనట్టు చూపిస్తాడు ప్రోమో లో. నన్ను ఎదవని చేసారు కదరా అంటూ కంటతడి పెడతాడు. ఇదిలా ఉండగా శనివారం రోజు సీక్రెట్ రూమ్ కి వెళ్లిన లోబో ఇవ్వాళా జరగబోయే ఎపిసోడ్ లో వస్తున్నట్టు చూపిస్తాడు ప్రోమో లో. మరి ఏం జరగబోతుందో చూడాలంటే రాత్రి జరిగే ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.
