https://oktelugu.com/

Rgv: “ఈటల వెన్నుపోటు” మూవీ గురించి స్పందించిన… ఆర్జీవి

Rgv: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రిలో శివ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీతో తన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచే అర్జీవి తన ప్రాజెక్ట్స్ కు వినూత్న పబ్లిసిటీ చేసుకోవడంలో ముందుంటారు. పబ్లిసిటీ విషయంలో ఆయనకు మించిన వారు ఇంకొకరు లేరు అంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఏదో ఒక విషయంపై వివాదాస్పద […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 21, 2021 / 06:32 PM IST
    Follow us on

    Rgv: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రిలో శివ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీతో తన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచే అర్జీవి తన ప్రాజెక్ట్స్ కు వినూత్న పబ్లిసిటీ చేసుకోవడంలో ముందుంటారు. పబ్లిసిటీ విషయంలో ఆయనకు మించిన వారు ఇంకొకరు లేరు అంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో ఉండే ఆర్జీవి… రాజకీయ నాయకులు, సినీ తారలపై కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ మూవీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఈ నేపథ్యం లోనే మాజీ మంత్రి ఈటల రాజేందర్… సీఎం కేసీఆర్ ల గురించి ఓ సినిమాను రాంగోపాల్ వర్మ తీస్తున్నారని… ఆయన పేరుతో ఓ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ” వెన్నుపోటు ఈటెలు” అంటూ టైటిల్ కూడా రాంగోపాల్ వర్మ ఫిక్సైనట్లు జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తన పేరుతో కొందరు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ పోస్టర్ ను వదిలారని చెప్పారు. తాను ఈటెల ఎపిసోడ్ పై ఎలాంటి సినిమాలు చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు.

    వర్మ ప్రస్తుతం కొండా సురేఖ దంపతుల పై సినిమా రూపొందిస్తున్నారు. బయోపిక్ సినిమాల నిర్మాణంలో రాంగోపాల్ వర్మ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రక్త చరిత్ర, కడప రెడ్లు, చంద్రబాబు వెన్నుపోటు పై సినిమాలు తీశారు. దీంతో ఈ మూవీ అంచనాలు నెలకొన్నాయి.