Nizamabad: ఎన్నో కలలు. మరెన్నో ఊసులు. కొత్త జీవితంపై ఎంతో ఆసక్తి. దీంతో తెల్లవారితే పెళ్లి. కొత్త జీవితంలోకి అడుగిడేందుకు ఎంతో ఇష్టపడింది. కానీ ఇంతలోనే ఆమె ఆశలు కల్లలయ్యాయి. జీవితంపై విరక్తి చెంది పెళ్లి కాకుండానే ఆత్మహత్యకు పాల్పడింది. నూరేళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. ఎదిగొచ్చిన కూతురు వివాహం చేసుకోకుండా బలవన్మరణం చెందడంతో అందరు విలపించారు. తమ కూతురు భవిష్యత్ ఇలా నాశనం కావడంపై తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. తమ కూతురుకు నూరేళ్లు నిండడంపై జీర్ణించుకోలేకపోయారు.

నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన ర్యాగల రవళి(26)కి నిజామాబాద్ కు చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. నిజామాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు వివాహం జరపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులంతా పెళ్లి వేడకకు బిజీగా పనులు చేస్తున్నారు. ఇంతలోనే చేదు నిజయం బయటపడింది. పెళ్లి కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో అందరు అవాక్కయ్యారు. తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడటంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాబోయే భర్త పెట్టిన వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరక ఎస్సై రాజిరెడ్డి పెళ్లికుమారుడిపై కేసు నమోదు చేశారు. అతడు మాట్లాడిన మాటలతోనే తమ కూతురు విగతజీవిగా మారిందని ఆరోపించారు. మరికొన్ని గంటల్లోనే పెళ్లి జరగాల్సి ఉండగా తమ కూతురు తిరిగి రాని లోకాలకు వెళ్లడంపై ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మెహందీ వేడుకలో సరదాగా డ్యాన్స్ చేసి సంతోషంగా గడిపిన రవళి ఆత్మహత్యకు పాల్పడటంపై అందరు అవాక్కయ్యారు.

కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి పాడె ఎక్కడంపై ఆందోళన చెందుతున్నారు. ఇంట్లోని స్టోర్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం లేవగానే తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన తండ్రి ప్రభాకర్ పోలీసులకు సమాచారం అందించారు. తమ కూతురు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటుందని భావించిన కూతురు అప్పుడే ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబంలో విషాదం నింపింది. పెళ్లి కుమారుడి వేధింపుల వల్ల తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని అతడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇంకా విచారణ జరిపితే కేసులో నిజాలు తెలిసే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు.