
Dasara Collections: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం మార్చి 30 వ తారీఖున విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓపెనింగ్స్ కూడా ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపొయ్యే రేంజ్ లో వచ్చాయి. మొదటి రోజు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.
ఇక రెండవ రోజు వర్కింగ్ డే కావడం తో ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం లో కాస్త తగ్గినప్పటికీ తెలంగాణ లో మాత్రం మూడు కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి చరిత్ర తిరగరాసింది. ఇప్పటి వరకు కేవలం స్టార్ హీరోల సినిమాలకు తప్ప రెండవ రోజు నైజాం ప్రాంతం లో ఈ రేంజ్ వసూళ్లు మీడియం రేంజ్ హీరోలకు ఇప్పటి వరకు రాలేదు.
సినిమా నేపథ్యం మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినది అవ్వడం తో ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం రెండవ రోజు వసూళ్లు దాదాపుగా 70 శాతానికి పడిపోయాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి సుమారుగా 50 కోట్ల రూపాయలకు జరిగింది.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండు రోజులకు కలిపి సుమారుగా 30 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందని చెప్తున్నారు.

బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు మరో 20 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యాల్సి ఉంటుంది.ఈరోజు మరియు రేపు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయిలు వస్తుందని అంచనా వేస్తున్నారు. బ్రేక్ ఈవెన్ అయితే చాలా తేలికగా అయిపోతుంది. కానీ సినిమా రేంజ్ ఏంటో తెలియాలంటే వచ్చే నెల చివరి వారం వరకు వేచి చూడాల్సిందే.