
Dasara Collections: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘దసరా’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. 50 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా, మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
మీడియం రేంజ్ హీరో అయినా నాని కి మొదటి రోజు ఈ రేంజ్ వసూళ్లు అంటే సాధారణమైన విషయం కాదు. ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రం ఇదే స్ట్రాంగ్ హోల్డ్ ని కనబర్చింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి తెలంగాణ లో అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయని, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అనుకున్న స్థాయి వసూళ్లు రాలేదని చెప్తున్నారు.రెండవ రోజు ఆంధ్ర ప్రదేశ్ లో వసూళ్లు కాస్త తగ్గిన విషయం వాస్తవమే కానీ, మూడు మరియు నాల్గవ రోజు మాత్రం మంచి వసూళ్లనే రాబట్టింది.
నైజాం ప్రాంతం లో ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే చెప్పాలి.ఈ సినిమాకి ఇక్కడ నాలుగు రోజుల్లో 19 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయట. ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలకు తప్ప, మీడియం రేంజ్ హీరోలకు ఇంత భారీ వసూళ్లు రావడం జరగలేదని, కేవలం నాని కి మాత్రమే జరిగిందని, ఇక నుండి ఆయన మీడియం రేంజ్ హీరో కాదని, ఈ సినిమా తో స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టాడని చెప్పుకుంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో రెండవ రోజు కాస్త తడబడినప్పటికీ మూడవ రోజు మరియు నాల్గవ రోజు మాత్రం మంచి వసూళ్లనే రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నాలుగు రోజులకు కలిపి 47 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక బ్రేక్ ఈవెన్ కి కేవలం మూడు కోట్ల రూపాయిల దూరం లోనే ఉందట, ఈరోజు లేదా రేపటి లోపు ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటేస్తుందని ఆశిస్తున్నారు.