Luana Andrade: అందం సహజంగా సంక్రమించాలి. సహజ పద్ధతుల్లో సాధించాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. కండల కోసం కొందరు హీరోలు స్టెరాయిడ్స్ వాడతారు. అది మంచిది కాదు. అనేక దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. అలాగే అమ్మాయిలు నాజూగ్గా ఉందనేందుకు అవసరానికి మించి డైట్ చేస్తారు. కడుపు మాడ్చుకుంటారు. శరీరానికి సరిపడా పోషకాలు తీసుకుని వ్యాయామం చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. అలా కాకుండా కృత్రిమ పద్దతిలో బరువు తగ్గితే విపరీత పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది.
బ్రెజిల్ కి చెందిన లువానా ఆండ్రడే చిన్న వయసులోనే కన్నుమూసింది. హార్ట్ అటాక్ కి గురైన లువానా చికిత్స పొందుతూ మరణించింద. లువానా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్. అలాగే నటి కూడాను. అందంగా కనిపంచాలనే తపనతో ఆమె లైపో సక్సన్ చేయించుకుంది. ఈ చికిత్సలో వైద్యులు శరీరంలోని కొవ్వును తొలగిస్తారు.
లువానా శరీరం నుండి కొవ్వు తొలగించాకా శరీరంలో దుష్ప్రభావాలు చోటు చేసుకున్నాయి. ఆమె తరచుగా హార్ట్ అటాక్ కి గురయ్యారు. నాలుగుసార్లు లువానాకు హార్ట్ అటాక్ వచ్చినట్లు సమాచారం. లైపో సక్సన్ కారణంగా రక్తం గడ్డలు కట్టినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు ఐసీయూ లో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.
శరీరానికి కొంత మేర కొవ్వు కూడా అవసరమే. శరీరంలో పేరుకున్న కొవ్వును ఒక్కసారిగా తొలగించడం సరికాదు. ఇండియాలో కూడా లైపో సక్సన్ చేయించుకున్న నటులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. హీరోయిన్ ఆర్తి అగర్వాల్ లైపో సక్సన్ చేయించుకోగా, తర్వాత ఆమెను అనారోగ్య సమస్యలు వెంటాడాయి. లువానా వయసు కేవలం 29 ఏళ్ళు కావడం కొసమెరుపు…