Derasar: ఆ ఊళ్లో ఇద్దర్ని పెళ్లి చేసుకోవాలి.. లేదంటే విడాకులే!

డేరాసర్‌ గ్రామంలో చాలా తక్కువ జనాభా ఉంది. ఇక్కడ కేవలం 600 మంది మాత్రమే నివసిస్తున్నారు. ప్రతీ డేరాసర్‌ పురుషుడికి ఇక్కడ కనీసం ఇద్దరు భార్యలు ఉంటారు.

Written By: Raj Shekar, Updated On : December 27, 2023 4:10 pm

Derasar

Follow us on

Derasar: భారత దేశంలో రాజులు, నవాబుల కాలంలో బహుభార్యత్వం అమలులో ఉండేది. కానీ, క్రమంగా ఈ పద్ధతి మారుతూ వచ్చింది. ఒకరికి ఒకే భార్య అనే చట్టం కూడా ప్రభుత్వం చేసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం నేరం అవుతుంది. అయితే కొంత మంది మొదటి భార్య అంగీకారంతో, మరికొందరు మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆ గ్రామంలో మాత్రం అబ్బాయిలకు రెండో పెళ్లి తప్పనిసరి. లేదంటే మొదటి భార్యకు కూడా విడాకులు ఇవ్వాలట. మరి ఈ వింత ఆచారం ఎక్కడ ఉందో తెలుసుకుందాం.

భారత్‌ – పాక్‌ సరిహద్దులో..
ఈ వింత ఆచారం ఉన్న గ్రామం పేరు డేరాసర్‌. రాజస్థాన్‌ రాష్ట్రంలో ఉంది. భారత్‌ – పాక్‌ సరిహద్దులో ఉన్న బార్మర్‌ జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో అబ్బాయిలు రెండు పెళ్లిళ్లు చేసుకునే ఆచారం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పుస్తకాలు, కథల్లో చదువుకున్నట్లుగానే ఇక్కడ ఆచారాలూ ఉన్నాయి.

తక్కువ జనాభా..
డేరాసర్‌ గ్రామంలో చాలా తక్కువ జనాభా ఉంది. ఇక్కడ కేవలం 600 మంది మాత్రమే నివసిస్తున్నారు. ప్రతీ డేరాసర్‌ పురుషుడికి ఇక్కడ కనీసం ఇద్దరు భార్యలు ఉంటారు. వినడానికి వింతగా అనిపించినా, ఈ ఆచారం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుంటే మరింత వింతగా లేదా ఆశ్చర్యంగా ఉంటుంది. డేరాసర్‌ గ్రామస్తులు మొదటి భార్యకు పిల్లలు ఉండరని నమ్ముతారు. పిల్లలు కలగాలంటే రెండో పెళ్లి తప్పనిసరని వారు విశ్వసిస్తారు. ఈ విచిత్రమైన నమ్మకం కారణంగానే ఆ ఊరిలో ప్రతీ పురుషుడు రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ ఆచారం వెనుక ఓ కథ కూడా ఉంది. గ్రామంలో గతంలో ఓ వ్యక్తి మొదట పెళ్లి చేసుకుంటే పిల్లలు కలుగలేదట. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు బిడ్డ పుట్టిందట. అప్పటి నుంచి ఈ ఆచారం మొదలైందని డేరాసర్‌ గ్రామస్తులు చెబుతున్నారు.