
Australia Vs India Test Series 2023: పరిమిత ఓవర్ల క్రికెట్లో పరిమితులు లేకుండా ఇండియా దూసుకెళ్తోంది.. 50 ఓవర్ల క్రికెట్ లోనూ మెరుపులు మెర్పిస్తోంది.. అటు టి20లో, ఇటు వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు సాధించింది.. టెస్టుల్లో మాత్రం మొదటి స్థానానికి దూరంగా ఉంది.. అలాంటి టీమిండియా సొంత గడ్డపై టెస్ట్ సవాల్ కు సిద్ధమైంది.. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియన్లను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముద్దాడిన టీమిండియా.. ఈసారి స్వదేశంలో సత్తా చాటేందుకు రెడీ అయింది. ఈ సీరీస్ తోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించాలనుకుంటున్న భారత్.. పనిలో పనిగా టెస్టుల్లోనూ నెంబర్ వన్ రాంక్ ప్రవచనం చేసుకోవాలని చూస్తోంది.
గతంతో పోలిస్తే మాటలు యుద్ధాలు పెద్దగా లేకపోయినా.. సమఉజ్జీలుగా కనిపిస్తున్న ఇరు జట్ల మధ్య రేసు రసవత్తరంగా సాగడం ఖాయమే. నిన్న మొన్నటి వరకు టి20, వన్డే మజా ఆస్వాదించిన అభిమానులంతా ఇక టెస్ట్ ఫార్మాట్ కు ట్యూన్ అయిపొయింది.. మరి ఎందుకు ఆలస్యం ఉదయం 9:30 నుంచే మహాసంగ్రామం. యువ ఆటగాళ్లంతా చక్కటి ఫామ్ లో ఉన్నారు. అందులో నుంచి 11 మందిని ఎంపిక చేయడం కష్టమే. పరిస్థితులకు తగ్గట్టే ఎంపిక ఉంటుందని అందరికీ చెప్పాను. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తుది జట్టును ఎంపిక చేసామని కెప్టెన్ రోహిత్ కుమార్ చెప్పాడు అంటే ఈ సిరీస్ భారత జట్టుకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటీవల న్యూజిలాండ్, శ్రీలంక జట్లపై టి20, వన్డే సిరీస్ లను టీం ఇండియా నెగ్గింది.. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో అత్యంత ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. నాగపూర్ వేదికగా తొలి టెస్ట్ కు తెరలేవనుంది. సీనియర్లు, జూనియర్ల కలయికతో రోహిత్ సేన బలంగా కనిపిస్తుంటే.. గత మూడు పర్యాయాలు ట్రోఫీ చేయించుకున్న ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని కృత నిశ్చయంతో ఉంది.
యాషెస్ సిరీస్ కంటే భారత్ పై విజయమే పెద్దదని ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ పేర్కొనగా, అశ్విన్ ఉచ్చును ఎలా జీవించాలో తమకు తెలుసా అని స్మిత్ అన్నాడు..పిచ్ పై రాద్ధాంతం అవసరం లేదని భారత సారథి రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఇక మూడు ఫార్మాట్లలో సారధ్య బాధితులు అందుకున్నాక రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా రూపంలో ప్రధాన సభ ఎదురుకానుంది. కెప్టెన్సీ భారం లేని విరాట్ విజృంభించేందుకు సిద్ధమవుతున్నాడు. పూజార, అశ్విన్, జడేజా, షమీ, సిరాజ్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం పక్కాగా కనిపిస్తోంది.. మిగిలిన స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది.

వన్డేలో వీర విహారం చేస్తున్న గిల్ ను ఓపెనర్ గా ఎంపిక చేసి కేఎల్ రాహుల్ ను మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ రాహుల్ ఓపెనింగ్ చేస్తే మిడిల్ ఆర్డర్లో గిల్ ను కాదని సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేసే అవకాశాలు కొట్టి పారేయలేం.. ఎటొచ్చీ ఈ ముగ్గురిలో ఇద్దరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కనుంది.. ఇక వికెట్ కీపర్ గా ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ ఆరంగేట్రం చేస్తాడా? లేక కిషన్ వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. మూడో స్పిన్నర్ గా అక్షర్ పటేల్, కుల దీప్ యాదవ్ లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
పిచ్, వాతావరణం: నాగ్ పుర్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది..మ్యాచ్ కు వర్ష సూచన లేదు.
తుది జట్ల అంచనా
భారత్: రోహిత్( కెప్టెన్) ,గిల్/ రాహుల్,పుజారా, కోహ్లీ, జడేజా, సూర్య, భరత్/ ఇషాన్, అశ్విన్, అక్షర్/ కులదీప్,షమీ, సిరాజ్.
ఆస్ట్రేలియా: కమిన్స్( కెప్టెన్), వార్నర్, ఖవాజా, లబుసేన్, స్మిత్, హెడ్, హ్యాండ్స్ కోబ్, కారీ, అగర్, లియాన్, బొలాండ్.