Homeక్రీడలుIndia vs Australia Nagpur Pitch Report: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: నాగ్ పూర్ పిచ్...

India vs Australia Nagpur Pitch Report: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: నాగ్ పూర్ పిచ్ లో గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

India vs Australia Nagpur Pitch Report
India vs Australia Nagpur Pitch Report

India vs Australia Nagpur Pitch Report: భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్, గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. నాగపూర్ వేదికగా గురువారం తొలి టెస్ట్ తో నాలుగు టెస్టుల సిరీస్ కు తెర లేవనుంది.. ఈ సీరిస్ లో విజయం కోసం రెండు జట్లు నెట్స్ లో చెమటోడ్చుతున్నాయి.. విజయం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం రోహిత్ సేనకు చాలా కీలకం. ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ లో టీమిండియా కనీసం రెండు మ్యాచ్లు గెలవాలి.

నాగపూర్ లోని విదర్భ మైదానంలో గత గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. దాదాపు 5 సంవత్సరాల తర్వాత నాగపూర్ స్టేడియం టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తోంది. చివరిసారిగా 2017 నవంబర్లో శ్రీలంకతో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో లంకను ఓడించింది. ఇప్పటివరకు ఈ స్టేడియంలో ఆరు టెస్టులు జరగగా.. నాలుగు టెస్టుల్లో టీం ఇండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్లో ఓటమిపాలైంది. మరొకటి డ్రా గా ముగిసింది.. 2010 లో సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ కు పరాభవం ఎదురైంది.. తొలి రెండు రోజులు ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా ఉండి… మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలించడం నాగపూర్ పిచ్ ప్రత్యేకత.

విదర్భ స్టేడియం వేదికపై భారత్ ఆస్ట్రేలియా జెట్ల మధ్య 2008లో తొలి టెస్ట్ జరిగింది. ఇందులో భారత్ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న మైదానంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 109 పరుగులతో పాటు, గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ధోనీ అర్ధ శతకాలతో అదరగొట్టారు.. భారత స్పిన్నర్లు హర్భజన్ సింగ్ 4/6, అమిత్ మిశ్రా 3/27, ఇషాంత్ శర్మ 2/31 రాణించారు.

India vs Australia Nagpur Pitch Report
India vs Australia Nagpur Pitch Report

విదర్భ స్టేడియంలో అత్యధిక స్కోరు 610/6 డిక్లేర్డ్.. శ్రీలంకపై భారత్ చేసిన స్కోరు ఇది. అత్యల్ప స్కోర్ దక్షిణాఫ్రికా 2015/16 సీజన్లో భారత్ పై 79 పరుగులకు ఆల్ అవుట్. అత్యధిక వ్యక్తిగత స్కోర్ దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లా 253*పరుగులను భారత్ పై 2010/11 లో సాధించాడు. ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన 2008/09 లో ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ క్రెజా 8/215 పేరిట ఉంది.. అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ గా టీం ఇండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ 357 పరుగులతో రికార్డ్ నెలకొల్పాడు. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ 354 పరుగులతో కొనసాగుతున్నాడు. మరో మూడు పరుగులు చేస్తే సెహ్వాగ్ ను అధిగమించే అవకాశం ఉంది. రవి చంద్రన్ ఆశ్విన్ ఇప్పటి వరకూ 19 వికెట్లు పడగొట్టాడు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular