https://oktelugu.com/

Bollywood Actress Kajol: మరో హీరోయిన్ కి కరోనా పాజిటివ్.. టెన్షన్ లో స్టార్ హీరో !

Bollywood Actress Kajol: దేశంలో కరోనా థర్డ్ వేవ్ వేగం తగ్గేదే లే అంటుంది. కరోనా కేసుల నమోదు ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్‌ కు కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌ లోకి వెళ్లింది. వైద్యులు సూచన ప్రకారం చికిత్స తీసుకుంటుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మొత్తానికి […]

Written By:
  • Shiva
  • , Updated On : January 30, 2022 / 02:59 PM IST
    Follow us on

    Bollywood Actress Kajol: దేశంలో కరోనా థర్డ్ వేవ్ వేగం తగ్గేదే లే అంటుంది. కరోనా కేసుల నమోదు ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్‌ కు కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌ లోకి వెళ్లింది. వైద్యులు సూచన ప్రకారం చికిత్స తీసుకుంటుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

    Bollywood Actress Kajol

    మొత్తానికి సినిమా వాళ్లకు కరోనా భారీ సినిమానే చూపిస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. నిజానికి కాజోల్‌ కరోనా విషయంలో మొదటి నుంచీ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయినప్పటికీ ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే విషయం పై కాజోల్ స్పందిస్తూ.. ఎంతో జాగ్రత్తగా ఉన్నా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. నాకు కరోనా సోకింది.

    Bollywood Actress Kajol and Ajay Devgn

    Also Read: రైటర్ గా బన్నీ.. హీరోగా అక్షయ్‌ కుమార్‌ !

    అయితే, ప్రస్తుతం తేలికపాటి జ్వరంతో పాటు స్వల్ప లక్షణాలు ఉన్నాయని కాజోల్ చెప్పారు. ప్రస్తుతానికి వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఐసోలేట్ అయినట్లు తెలిపింది. ప్రజలంతా మాస్క్ ధరించి క్షేమంగా ఉండాలని ఆమె కోరారు. కాజోల్ కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అలాగే స్టార్ హీరో అజయ్ దేవగన్ కి కూడా టెన్షన్ మొదలైంది.

    ఇప్పుడు అజయ్ దేవగన్ కూడా ఐసోలేషన్‌ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్టు అయిన వ్యక్తులు ఐసోలేట్‌ అవ్వాలనీ, లక్షణాలేమైనా గుర్తిస్తే పరీక్షలు చేయించుకోవాలని కాజోల్ సూచించింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.

    అసలు నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ మళ్ళీ ఆందోళన బాట పట్టారు. సడెన్ గా షూటింగ్స్ కూడా ఆపుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే, చాలా సినిమాలు మధ్యలోనే షెడ్యూల్స్ ను క్యాన్సిల్ చేసుకున్నాయి.

    Also Read: మెగాస్టారే స్వయంగా కవిత అల్లి పోస్ట్ చేస్తే, వైరల్ కాకపోతే ఎలా ?

    Tags