https://oktelugu.com/

Allu Arjun-Akshay Kumar: రైటర్ గా బన్నీ.. హీరోగా అక్షయ్‌ కుమార్‌ !

Allu Arjun-Akshay Kumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేశాడు. కాగా తనలోని మరో టాలెంట్ ను చిరు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఏమిటి ఆ టాలెంట్ అనుకుంటున్నారా ? బన్నీ రచయితగా మారబోతున్నాడు. బన్నీ ఏమిటి ? రచయిత ఏమిటి ? విచిత్రంగా అనిపించినా ఇది నిజమే. అయితే, రైటర్ గా మారుతుంది సినిమాల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 30, 2022 / 02:49 PM IST
    Follow us on

    Allu Arjun-Akshay Kumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేశాడు. కాగా తనలోని మరో టాలెంట్ ను చిరు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఏమిటి ఆ టాలెంట్ అనుకుంటున్నారా ? బన్నీ రచయితగా మారబోతున్నాడు. బన్నీ ఏమిటి ? రచయిత ఏమిటి ? విచిత్రంగా అనిపించినా ఇది నిజమే.

    Allu Arjun-Akshay Kumar

    అయితే, రైటర్ గా మారుతుంది సినిమాల కోసం కాదు, తన ట్రావెల్ అనుభవాల పై బన్నీ ఓ స్టోరీ రాయబోతున్నాడట. చాలా రోజుల నుంచి రైటర్ అవ్వాలని బన్నీ అనుకుంటున్నా.. ఇన్నాళ్లు సరైన టైమ్ దొరకలేదు అట. ఇప్పటికీ తనకు కొంత టైమ్ దొరికింది అని, అందుకే, తనలోని రైటింగ్ కోరిక తీర్చుకోవడానికి బన్నీ రెడీ అయ్యాడు. మరి బన్నీ రాసె బుక్ ఎలా ఉండబోతుందో చూడాలి.

    Allu Arjun-Akshay Kumar

    Also Read: Allu Arjun With Pushpa Team: బన్నీని విస్మయానికి గురి చేసిన ‘ఏఏ’ ఫ్యామిలీ !

    అన్నట్టు బన్నీ సినిమాలకు ఇప్పుడు నార్త్‌లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే అల వైకుంఠపురములో చిత్రాన్ని గ్రాండ్‌గా టీవీలో రిలీజ్‌ చేస్తుండగా, దువ్వాడ జగన్నాధం చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఎప్పటి నుండో దిల్‌ రాజు ఈ ప్రాజెక్ట్‌ గురించి ఆలోచిస్తున్నాడట.

    ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్‌ బాలీవుడ్‌కి తగ్గట్టు ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించబోతున్నాడట. మరి హరీష్ శంకర్‌ ఎలా రాస్తాడో చూడాలి. అక్షయ్‌ కుమార్‌ స్క్రిప్ట్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఏ మాత్రం బాగా లేకపోయినా సినిమా చేయడు.

    Also Read: Khali Pushpa Dialogue: పుష్ప డైలాగ్ః త‌గ్గేదే లే అంటున్న ఖ‌లీ

    Tags