Body Builder Selling Onions: కండల వీరుడికి ఏంటీ దుస్థితి.. ఆఖరుకు ఉల్లిపాయలు ఎందుకు అమ్ముతున్నాడే!

Body Builder Selling Onions: పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సి వస్తుంది. కాలం కలిసి రాకపోతే గడ్డిపోచే పామై కరుస్తుంది అంటారు. ఎవరికైనా విధి వెక్కిరిస్తే అంతే సంగతి. కోటీశ్వరుడు కూడా బికారీ కావచ్చు. బిచ్చగాడు కూడా కుబేరుడవ్వచ్చు. కాలం విలువ అంతలా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోబోయేది కూడా అదే. ఆరుసార్లు రాష్ట్రస్థాయిలో బాడీబిల్డింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన ఓ ఆటగాడు ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాడంటే నమ్ముతారా? ఈ రోజుల్లో చిన్న ఆటగాడికే అందలాలు ఎక్కించే తరుణంలో […]

Written By: Srinivas, Updated On : May 5, 2022 9:37 am
Follow us on

Body Builder Selling Onions: పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సి వస్తుంది. కాలం కలిసి రాకపోతే గడ్డిపోచే పామై కరుస్తుంది అంటారు. ఎవరికైనా విధి వెక్కిరిస్తే అంతే సంగతి. కోటీశ్వరుడు కూడా బికారీ కావచ్చు. బిచ్చగాడు కూడా కుబేరుడవ్వచ్చు. కాలం విలువ అంతలా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోబోయేది కూడా అదే. ఆరుసార్లు రాష్ట్రస్థాయిలో బాడీబిల్డింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన ఓ ఆటగాడు ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాడంటే నమ్ముతారా? ఈ రోజుల్లో చిన్న ఆటగాడికే అందలాలు ఎక్కించే తరుణంలో అతడు మాత్రం సాధారణ వ్యక్తిలా మారి వీధివీధి తిరుగుతూ ఉల్లిపాయలు అమ్ముకోవడం చూస్తుంటే బాధ కలుగుతోంది.

Body Builder Selling Onions

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన తలారి రాధమ్మ, లక్ష్మినారాయణ దంపతులు రెండో సంతానం భద్రయ్య. చిన్నప్పటి నుంచే అతడికి క్రీడలంటే ప్రాణం. దీంతో బాడీ బిల్డింగ్ పై శ్రద్ధ పెంచుకున్నాడు. ఎలాగైనా బాడీబిల్డర్ గా ఎదగాలని కలలు కన్నాడు. అతడి కలలు నెరవేరాయి. రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుసార్లు ప్రథమ బహుమతి అందుకున్నాడు. కానీ పేదరికం కావడంతో అతడికి రావాల్సిన విలువ రాలేదు. ఆర్థిక ఇబ్బందులు కలవరపెట్టాయి.

Also Read: AP Employees: ఏపీలో ఉద్యోగుల సమస్యలు తీర్చరా?

Body Builder Selling Onions

దీంతో ఏం చేయాలో అర్థం కాక ఉల్లిపాయలు అమ్ముకునే వృత్తిని చేపట్టాడు. వాడవాడలా తిరుగుతూ ఉల్లిపాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. హర్యానా, మణిపూర్ రాష్ట్రాల్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినా ప్రయాణ ఖర్చులు లేకపోవడంతో హాజరు కాలేకపోయాడు. త్వరలో జరగబోయే అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు.

తెలంగాణ ప్రభుత్వం ఆదుకుని అతడికి ఆర్థిక సాయం చేస్తే దేశం కోసం మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంది. కానీ ఎవరు కూడా అతడి ప్రతిభను గుర్తించడం లేదు. సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా అతడి టాలెంట్ అట్టడుగునే ఉండిపోతోంది. సాయం చేసే దాతలు ముందుకు వస్తే దేశం కోసం పతకాలు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఎవరైనా ఆదుకుంటే తప్ప అతడికి స్తోమత లేకపోవడం గమనార్హం.

Also Read:Group Exams In Urdu: ఉర్దూలో గ్రూప్ పరీక్షలా? జాబ్స్ అన్నీ వాళ్లకేనా!

Tags