YS Sharmila Padayatra:1000 కిలోమీటర్లకు చేరిన వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం

YS Sharmila Padayatra: ఆమె పాదం ఎటు పోతున్నా.. పయనం ఎందాకైనా.. తెలంగాణలో మార్పునకు శ్రీకారం చుడుతోంది వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్మాయంగా ఎదుగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65 వ రోజు కొనసాగనున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఉదయం 10 గంటలకు పినపాక నియోజక వర్గం ఆశ్వాపురం మండలం గౌతమీ నగర్ క్యాంప్ నుంచి […]

Written By: NARESH, Updated On : May 5, 2022 11:50 am
Follow us on

YS Sharmila Padayatra: ఆమె పాదం ఎటు పోతున్నా.. పయనం ఎందాకైనా.. తెలంగాణలో మార్పునకు శ్రీకారం చుడుతోంది వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్మాయంగా ఎదుగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65 వ రోజు కొనసాగనున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఉదయం 10 గంటలకు పినపాక నియోజక వర్గం ఆశ్వాపురం మండలం గౌతమీ నగర్ క్యాంప్ నుంచి పాదయాత్ర షర్మిల మొదలు పెట్టారు. . అశ్వాపురం మండల పరిధిలోని గొల్లగుడెం, సీతారామపురం, బిజీ కొత్తూరు క్రాస్, మొండికుంటలో పర్యటించారు.

YS Sharmila

ఇక అక్కడి నుంచి మల్లెల మడుగు,సత్యనారాయణ పురం,రామచంద్రపురం,గరివొడ్డు, నెల్లిపాక క్రాస్, మీదుగా సాగనున్న షర్మిల పాదయాత్ర సాగింది. సాయంత్రం 6 గంటలకు బూర్గపాడు నియోజక వర్గం ఇరవండి కొత్తూరులో పాదయాత్ర ముగించుకొని అక్కడే నైట్ ఆల్ట్ చేయనున్నారు.

Also Read: Tollywood: టుడే మూవీ టాపిక్స్ – పంచ్ లైన్స్

ఉదయం 11 గంటలకు సీతారామ పురం గ్రామం లో రైతులతో కలిసి రైతు గోస ధర్నా లో పాల్గొననున్న షర్మిల రైతుల సమస్యలను ఎలుగెత్తి చాటనున్నారు. సాయంత్రం 5 గంటలకు రామచంద్రాపురం గ్రామంలో ప్రజలతో మాట – ముచ్చట కార్యక్రమం నిర్వహించారు.

ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రతి గ్రామంలో మాట ముచ్చటను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హామీనిస్తున్నారు. తాజాగా సత్తుపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి అవుతున్న సందర్భంగా రాచకొండ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురువారం వైయస్ షర్మిల పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి అవుతున్న సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ ఎండి రహీం షరీఫ్ ఆధ్వర్యంలో రాచకొండ గలిప్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయిస్తున్నారు. ఇక ఆ తర్వాత శివలింగానికి ప్రత్యేక పూజలు కూడా చేయటం జరుగుతుంది. అనంతరం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని షర్మిల కోరారు.

Also Read: AP Employees: ఏపీలో ఉద్యోగుల సమస్యలు తీర్చరా?