https://oktelugu.com/

Bill Gates- Paula Hurd: లేటు వయసులో ఘాటు ప్రేమ: డబ్బున్న వాళ్లకు ఏదైనా చెల్లున్‌

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ తెలుసు కదా! అతడు మాజీ బ్రాడ్‌ కాస్ట్‌ జర్నలిస్ట్‌ లారెన్‌ శాంచెజ్‌ అనే ఆమెతో కొన్నాళ్లుగా కలిసి ఉంటున్నాడు.

Written By:
  • Rocky
  • , Updated On : August 5, 2023 / 08:47 AM IST

    Bill Gates- Paula Hurd

    Follow us on

    Bill Gates- Paula Hurd: సిరిగల వానికి ఏదైనా చెల్లున్‌. కొండ మీది కోతి దిగి వచ్చున్‌. సర్గ సుఖాలు అంది వచ్చున్‌. వెనుకటికి ఓ కవి రాసిని మాటలివి. ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌. ఆ గర్భ శ్రీమంతుడైన ఈ టెక్‌ వ్యాపారి.. మొదట్లో మెలిండాను వివాహం చేసుకున్నాడు. సుదీర్ఘకాలం పాటు సాగిన వీరి వైవాహిక జీవితానికి బ్రేక్‌లు పడ్డాయి. తర్వాత ఏముంది కటీఫ్‌ చెప్పుకున్నారు. ఎవరి దారుల్లో వారు వెళ్తున్నారు. కోర్టు చెప్పిన ప్రకారం మెలిండాకు భారీగానే బిల్‌ గేట్స్‌ భరణం సమర్పించుకున్నాడు. మొదటి నుంచి సమాజ సేవను ఇష్టపడే మెలిండా అదే దారిలోనే వెళ్తోంది. బిల్‌గేట్స్‌ రసిక్‌ రాజా కాబట్టి మరో యువతిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. మీడియా ఊరుకోదు కదా! ఇదీ బిల్‌ గేట్స్‌ అసలు యవ్వారమని అమెరికన్‌ సమాజానికి చూపించింది. ఇంతకీ ఏం జరిగిదంటే.

    అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ తెలుసు కదా! అతడు మాజీ బ్రాడ్‌ కాస్ట్‌ జర్నలిస్ట్‌ లారెన్‌ శాంచెజ్‌ అనే ఆమెతో కొన్నాళ్లుగా కలిసి ఉంటున్నాడు. ఇటీవల ఇద్దరూ ఎంగేజ్‌ మెంట్‌ చేసుకున్నారు. అది కూడా లక్షల కోట్ల విలువైన షిప్‌ లో. అసలే లెక్కపెట్టలేనంత డబ్బున్న వాడు కాబట్టి ఆడంబంరంగా వేడుక చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి బిల్‌ గేట్స్‌ను ఆహ్వానించాడు. బిల్‌ గేట్స్‌ అసలే ఇప్పుడు ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు కాబట్టి తన నెచ్చెలి పౌలా హర్డ్‌ ను తీసుకెళ్లాడు. మొన్నటి దాకా ఆమెతో సమ్‌ బంధం మాటేంటి గురూ అని మీడియా అడిగితే ఏహే అదేం లేదు. నేను సుద్ధపూసనని పత్తిత్తు కబుర్లు చెప్పాడు. తీరా మీడియాకు అడ్డంగా దొరికి పోయే సరికి తెల్ల మొహం వేశాడు. ఆ ఎంగేజ్‌ మెంట్‌లో బిల్‌ గేట్స్‌ ఆడిపాడాడు. తన నెచ్చెలితో సందడి చేశాడు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

    ఈ ఫొటోలు బిల్‌ గేట్స్‌, పౌలా హర్డ్‌ సమ్‌ బంధంలో ఉన్నారనడానికి కారణమని అమెరికన్‌ జనాలు అంటున్నారు. అంతకు ముందు బిల్‌ గేట్స్‌, పౌలా హర్డ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మ్యాచ్‌ లు వీక్షిస్తూ జర్నలిస్టుల కంటపడ్డారు.అ అప్పట్లోనే వీరిద్దరి మధ్య ఏదో ఉందని వెస్ట్రన్‌ మీడియా కోడై కూసింది. కానీ దీనిని బిల్‌ గేట్స్‌ ఖండించాడు. జెఫ్‌ బేజోస్‌ ఎంగేజ్‌ మెంట్‌లో మాత్రం దొరికిపోయాడు. తర్వాత పలు సందర్భాల్లో చెట్టాపట్టాలేసుకుని దర్శనమిచ్చారు. పబ్లిక్‌గా తిరగడంతో ఈ ప్రేమ పక్షుల పెళ్లి త్వరలో జరుగుతుందనే పుకార్లు జోరందుకున్నాయి. కాగా, మిలిండా గేట్స్‌ నుంచి విడిపోయిన తర్వాత బిల్‌ గేట్స్‌ పౌలా హర్డ్‌ తో సన్నిహితంగా మెలుగుకుంటూ వస్తున్నారు.