J. D. Chakravarthy- Vishnupriya: యాంకర్ విష్ణుప్రియ నటనపై దృష్టి పెట్టారు. ఆమె నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. విష్ణుప్రియ దయ వెబ్ సిరీస్లో కీలక రోల్ దక్కించుకుంది. ఆమెది కథలో కీలకమైన ఫుల్ లెంగ్త్ రోల్. జర్నలిస్ట్ షబానాగా ఆమె అలరించారు. ఈషా రెబ్బా కంటే కూడా విష్ణుప్రియ పాత్రకే స్పేస్ ఎక్కువ ఉంది. ఆమె పాత్ర హీరో జేడీ చక్రవర్తితో ట్రావెల్ చేస్తుంది. దయ సిరీస్లో ఇంత ప్రాధాన్యత కలిగిన పాత్ర జస్ట్ ఆమె ఫిజిక్ చూసి ఇచ్చామని దర్శకుడు పవన్ సాధినేని చెప్పడం విశేషంగా మారింది.
దయ ప్రమోషనల్ ఈవెంట్లో విష్ణుప్రియ మాట్లాడుతూ… దర్శకుడు పవన్ సాధినేనితో జాగ్రత్త, అతనికి కొంచెం తలతిక్క అని మా మేనేజర్ చెప్పారు. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. కానీ మంచి టీమ్ తో పనిచేసే అవకాశం దక్కింది. తంతే బూరెల బుట్టలో పడ్డాను. కీలక పాత్ర దక్కింది. ఐ యామ్ లో లక్కీ, అన్నారు. అనంతరం దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడారు. విష్ణుప్రియను కేవలం ఫిజిక్ కోసం ఎంపిక చేశాము అన్నారు. ఆయన పరోక్షంగా ఈ పాత్రకు ఫిజిక్ అవసరం ఎత్తు పొడుగు ఉన్న విష్ణుప్రియకు నటన రాకపోయినా పర్లేదు అన్నట్లు మాట్లాడారు.
అనంతరం జేడీ చక్రవర్తి మాట్లాడుతూ… విష్ణుప్రియది చిన్న పిల్లల మనస్తత్వం. నైస్ సోల్. అందుకే ఆమె ఏం చేసిన ఎంజాయ్ చేస్తాను, అని అన్నారు. ఆగస్టు 4 నుండి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న దయ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సిరీస్ మెప్పించింది. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, విష్ణుప్రియ, బబ్లు పృథ్వి, జోష్ రవి, కమల్ కామరాజు, రమ్యా నంబీసన్ కీలక రోల్స్ చేశారు.
బెంగాలీ సిరీస్ తక్దీర్ కి రీమేక్ గా దయ తెరకెక్కింది. దయ సిరీస్ కి సీక్వెల్ ఉంది. అందుకే క్లైమాక్స్ అసంపూర్తిగా ముగించారు. ఇక విష్ణుప్రియకు ఈ సిరీస్ తో మంచి పేరు వచ్చింది. ఆమె నటిగా బిజీ అయ్యే సూచనలు కలవు.