Bihar Couple: దేశంలో అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గతంలో చత్తీస్ గడ్ లో ఓ బాలిక మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బాలికను భుజాన వేసుకుని పదికిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకెళ్లిన ఉదంతం మరవక ముందే మరో సంఘటన జరిగింది. కన్నబిడ్డ చనిపోయినా ఆస్పత్రి సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో కన్నతండ్రి బిచ్చమెత్తుకున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మనుషుల్లో కూడా రాక్షసులుంటారని తెలిపేందుకు ఇలాంటి ఘటనలే తార్కాణాలుగా నిలుస్తున్నాయి. బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం నిజంగా దురదృష్టమే. కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆ కన్నతండ్రి పడిన బాధ చూస్తుంటే స్థానికులకు కూడా జాలేసింది. ఇంతటి హృదయ విదాకరకర దృశ్యం అందరిని కలచివేసింది. ఆ తండ్రి కుమారుడి శవం తీసుకెళ్లాలని ఊరంతా తిరుగుతూ డబ్బులు అడుక్కోవడంతో సోషల్ మీడియా ఈ వీడియో అందరిలో ఆవేదన కలిగించింది.
Also Read: Bapila Hari: సంగీతప్రపంచంలో ఓ సంచలనం మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహిరి..
ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందికి కొద్ది రోజులుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఇలా వచ్చే రోగుల బంధువుల దగ్గర డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ఏమి చేయలేని పరిస్థితి. దీనిపై సంబంధిత యంత్రాంగం కూడా స్పందించిది. రోగుల దగ్గర ఇలా డబ్బులు వసూలు చేయడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. సిబ్బంది నిర్వాకంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
సిబ్బంది రూ.50 వేలు డిమాండ్ చేయడం సంచలనం కలిగించింది. ఈ అమానవీయ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా అదనపు మెజిస్ట్రేట్ వినయ్ కుమార్ రాయ్ తెలిపారు. మృతదేహం పోలీస్ కస్టడీలో ఉండటంతో శవాన్ని అప్పగించేందుకు ఆలస్యం జరిగినట్లు మరో వాదన కూడా వస్తోంది. మొత్తానికి మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. స్వార్థమే పరమార్థంగా తోస్తోంది. ఎదుటి వారి బాధలు కూడా వారికి లాభాలు తెచ్చిపెట్టేవిగా ఉండటం గమనార్హం. ఇలాంటి సమయాల్లో కూడా డబ్బులు డిమాండ్ చేయడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. మనుషుల్లో పరివర్తన ఎప్పటికి వస్తుందో తెలియడం లేదు.