Balayya with Power Star: నందమూరి బాలకృష్ణ తొలిసారిగా వ్యాఖ్యాతగా మారి మన అందరిని అలరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆహ మీడియా లో ప్రసారం అయినా ఈ షో కి అపూర్వమైన స్పందన లభించింది..టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలందరితో బాలయ్య ఆడిన ముచ్చట్లు అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..అతి త్వరలోనే రెండవ సీసన్ ని ప్రారంబించుకోబోతున్న ఈ షో కి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..గతం లో బాలయ్య బాబు టాలీవుడ్ టాప్ హీరోలు అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజ రవితేజ, విజయ్ దేవరకొండా,రానా దగ్గుపాటి వంటి ఎంతోమంది క్రేజీ స్టార్స్ తో చిట్ చాట్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే తనకి మూడు దశాబ్దాల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద హోరాహోరీ పోటీని ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి తో మాత్రం ఇంటర్వ్యూ చెయ్యకపోవడం తో అందరూ నిరాశకి గురి అయ్యారు..అయితే ఈసారి సీసన్ 2 లో మొదటి ఇంటర్వ్యూ మెగాస్టార్ చిరంజీవి తోనే చేయబోతున్నాడు అట బాలకృష్ణ..ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కూడా ఈ షో లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నాడట ఆహా మీడియా అధినేత అల్లు అరవింద్..ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని ఈ విషయం గురించి అడగగా ఆయన కూడా పాజిటివ్ గా స్పందించినట్టు తెలుస్తుంది..మొదటి ఎపిసోడ్ ని మెగాస్టార్ చిరంజీవి తో మరియు చివరి ఎపిసోడ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేస్తునట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..మొదటి సీసన్ మొదటి ఎపిసోడ్ ని బాలయ్య బాబు మంచు మోహన్ బాబు తో చెయ్యగా..చివరి ఎపిసోడ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..మహేష్ బాబు తో చేసిన ఇంటర్వ్యూ ఆహా మీడియా లో అత్యధిక వ్యూస్ ని సాధించినదిగా నిలిచింది..మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ తో చెయ్యబోతున్న ఇంటర్వూస్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి..ఇక బాలయ్య బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఒక్క సినిమా చేస్తుండగా,క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో మరో సినిమా చెయ్యబోతున్నాడు..ఈ రెండు సినిమాల పై అభిమానుల్లోనే కాకుండా ట్రేడ్ సర్కిల్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.