https://oktelugu.com/

సూర్యకుమార్‌‌ను ఎంపిక చేయరా? బీసీసీఐపై విమర్శలు

ఐపీఎల్‌ చూస్తున్న క్రికెట్‌ ప్రేక్షకులకు సూర్యకుమార్‌‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదనుకుంట. ముంబై టీంలో సభ్యుడిన సూర్యకుమార్‌‌ తనదైన బ్యాటింగ్‌ శైలితో ఐపీఎల్‌లో దూసుకెళ్తున్నాడు. మ్యాచ్‌ మ్యాచ్‌ హైయస్ట్‌ స్కోర్లు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. హాఫ్‌ సెంచరీల మీద హాఫ్‌ సెంచరీలు బాదుతున్నాడు. నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనే 43 బాల్స్‌లో 79 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. Also Read: ఐపీఎల్ హీట్: ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లేవి..? మరి ఇంతలా రాణిస్తున్న సూర్యకుమార్‌‌ను […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 / 11:08 AM IST
    Follow us on

    ఐపీఎల్‌ చూస్తున్న క్రికెట్‌ ప్రేక్షకులకు సూర్యకుమార్‌‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదనుకుంట. ముంబై టీంలో సభ్యుడిన సూర్యకుమార్‌‌ తనదైన బ్యాటింగ్‌ శైలితో ఐపీఎల్‌లో దూసుకెళ్తున్నాడు. మ్యాచ్‌ మ్యాచ్‌ హైయస్ట్‌ స్కోర్లు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. హాఫ్‌ సెంచరీల మీద హాఫ్‌ సెంచరీలు బాదుతున్నాడు. నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనే 43 బాల్స్‌లో 79 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

    Also Read: ఐపీఎల్ హీట్: ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లేవి..?

    మరి ఇంతలా రాణిస్తున్న సూర్యకుమార్‌‌ను ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లోకి ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిద్వారా బీసీసీఐ మరోసారి విమర్శల పాలైంది. సునీల్‌ జోషి సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీపై ఇప్పుడు మాజీలు ఫైర్‌‌ అవుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు సూర్యకుమార్‌‌ను ఎందుకు ఎంపిక చేయలేదంటూ నిలదీస్తున్నారు.

    ‘ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రతిభావంతుల్లో సూర్యకుమార్‌‌ ఒకడు. అతన్ని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బ్యాటింగ్‌ నైపుణ్యం పరంగా చూస్తే టీమ్‌ ఇండియా అత్యుత్తమ ఆడగాడితో సూర్యకుమార్‌‌ను పోల్చగలను. నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. జట్టులో స్థానం కోసం ఇంతకంటే ఇంకేం కావాలి. ఫామ్‌, ఫిట్‌నెస్‌ కాకుండా ఇంకా ఏముంటాయి. గాయం కారణంగా రోహిత్‌ శర్మ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యతో మిడిలార్డర్‌‌ను పటిష్టం చేయచ్చు. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రశ్నించాలి’ అంటూ దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌‌ సూచించారు.

    Also Read: ఐపీఎల్: సన్ రైజర్స్ నిలవాలంటే గెలవాల్సిందే?

    ‘ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా కేఎల్‌ రాహుల్‌ను టెస్టు జట్టులోకి ఎంపిక చేయడం చెడు సంప్రదాయం. మరీ ముఖ్యంగా గత కొన్ని టెస్టు మ్యాచుల్లో విఫలమైన ఆటగాడిని ఎంచుకున్నారు. అతడు విజయవంతం అవుతాడా..? విఫలం అవుతాడా..? అన్నది వేరే. కానీ.. ఇలాంటి ఎంపికలు రంజీ ఆటగాళ్లను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తాయి’ అని సంజయ్‌ మంజ్రేకర్‌‌ అభిప్రాయపడ్డారు. ‘టీమ్‌ ఇండియాకు ఎంపిక కావాలంటే సూర్యకుమార్‌‌ ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రతీ సీజన్‌లోనూ రాణిస్తున్నాడు. రంజీల్లోనూ మంచి ప్రదర్శన ఇచ్చాడు. బీసీసీఐ సెలక్టర్లు ఒకసారి అతని రికార్డులు పరిశీలించండి’ అంటూ హర్భజన్‌ సింగ్‌ అన్నారు. ‘సూర్య నమస్కార్‌‌.. ధైర్యంతో సహనంగా ఉండు’ అంటూ రవిశాస్త్రి పేర్కొన్నారు