https://oktelugu.com/

విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పిన అభిజీత్

బిగ్ బాస్ విజేతగా నిలిచిన అభిజీత్ తనకు ఇంత ఓట్లు గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఇందుకోసం జనాల్లోకి వెళుతున్నాడు. అంతేకాదు.. తనకు మద్దతు పలికిన సినీ సెలెబ్రెటీలను కలుస్తున్నాడు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన స్టార్ హీరో విజయ్ దేవరకొండను కలిసి బిగ్ బాస్ విజేత అభిజీత్ థ్యాంక్స్ చెప్పాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అభిజీత్ హీరోగా నటించగా.. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2020 / 09:48 PM IST
    Follow us on

    బిగ్ బాస్ విజేతగా నిలిచిన అభిజీత్ తనకు ఇంత ఓట్లు గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఇందుకోసం జనాల్లోకి వెళుతున్నాడు. అంతేకాదు.. తనకు మద్దతు పలికిన సినీ సెలెబ్రెటీలను కలుస్తున్నాడు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.

    ఇక తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన స్టార్ హీరో విజయ్ దేవరకొండను కలిసి బిగ్ బాస్ విజేత అభిజీత్ థ్యాంక్స్ చెప్పాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అభిజీత్ హీరోగా నటించగా.. ఇదే సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న క్యారెర్టర్ లో నెగెటివ్ రోల్ చేశాడు. ఆ పరిచయంతోనే బిగ్ బాస్ ఫైనలిస్ట్ గా ఉన్న అభిజీత్ కు ఓటు వేయాలని విజయ్ అభిమానులకు పిలుపునిచ్చాడు.

    అందరూ సపోర్టు చేయడంతో బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక ఓట్లను అభిజీత్ పొందాడు. దీనికి అభిమానులతోపాటు సెలెబ్రెటీల సపోర్టు ఉంది. అందుకే వారందరినీ కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.

    తన గెలుపు కోసం పిలుపునిచ్చిన విజయ్ దేవరకొండను ఈరోజు అభిజీత్ కలిశాడు. ఈ మేరకు థ్యాంక్స్ చెప్పాడు. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫొటోను షేర్ చేసి ‘ఫుల్ చిల్’ అంటూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.