https://oktelugu.com/

Revanth Shrihaan : రియల్ విన్నర్ నేను- టైటిల్ అందుకుంది నేను… రేవంత్-శ్రీహాన్ మధ్య మొదలైన మాటల యుద్ధం!

Revanth Shrihaan : హౌస్లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న రేవంత్-శ్రీహాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరోక్షంగా వీరిద్దరూ నేను గొప్పంటే నేను గొప్ప అనుకుంటున్నారు. ఏం జరిగిందన్నది ముఖ్యం కాదు, టైటిల్ కొట్టాలి అనుకున్నాను గెలిచాను అని రేవంత్ అంటుంటే… ఓట్ల ఆధారంగా రియల్ విన్నర్ నేనే అని శ్రీహాన్ అంటున్నాడు. వీరిద్దరి కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఆదివారం ముగిసింది. టైటిల్ విన్నర్ గా రేవంత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 19, 2022 / 09:36 PM IST
    Follow us on

    Revanth Shrihaan : హౌస్లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న రేవంత్-శ్రీహాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరోక్షంగా వీరిద్దరూ నేను గొప్పంటే నేను గొప్ప అనుకుంటున్నారు. ఏం జరిగిందన్నది ముఖ్యం కాదు, టైటిల్ కొట్టాలి అనుకున్నాను గెలిచాను అని రేవంత్ అంటుంటే… ఓట్ల ఆధారంగా రియల్ విన్నర్ నేనే అని శ్రీహాన్ అంటున్నాడు. వీరిద్దరి కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఆదివారం ముగిసింది. టైటిల్ విన్నర్ గా రేవంత్ అవతరించాడు. అయితే గత సీజన్స్ లో ఎన్నడూ చూడని ఓ ట్విస్ట్ ఇక్కడ చోటు చేసుకుంది.

    ఫలితం రాకముందే ఇద్దరిలో ఒకరు రూ. 40 లక్షలు తీసుకొని రేసు నుండి తప్పుకోవచ్చని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఇద్దరిలో గెలిచేది ఒక్కరే కాబట్టి మరొక కచ్చితంగా నష్టపోతారు. వట్టి చేతులతో వెళ్లే కంటే ఈ డబ్బులు తీసుకొని బయటకు వెళ్లాలని సలహా ఇచ్చాడు. మొదట రిజెక్ట్ చేసిన శ్రీహాన్ కాసేపటి తర్వాత నాగార్జున ఆఫర్ కి ఒప్పుకున్నారు. డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నారు. దీంతో బిగ్ బాస్ తెలుగు 6 విన్నర్ రేవంత్ అయ్యాడు.

    టైటిల్ రేవంత్ కి అందించాక నాగార్జున మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. స్వల్ప ఓట్ల తేడాతో రేవంత్ ఓడిపోయాడు, శ్రీహాన్ గెలిచాడని వెల్లడించారు. ఈ పరిణామం అందరికీ పిచ్చెక్కించింది. తొందరపడి శ్రీహాన్ టైటిల్ ప్రైజ్ మనీ కోల్పోయాడు. రేవంత్ టైటిల్ గెలిచి కూడా శ్రీహాన్ తప్పుకోవడం వలన గెలిచాననే బాధకు గురయ్యాడు. ఈ క్రమంలో రేవంత్ బిగ్ బాస్ కేఫే షోలో ఈ అపవాదును పోగొట్టుకునే ప్రయత్నం చేశాడు. తాను బెస్ట్ ప్లేయర్ అని, ఇతర కంటెస్టెంట్ మాదిరి ఆడవాళ్లను అడ్డుపెట్టుకొని ఆడలేదు అన్నాడు.

    డే వన్ నుండి నేను నాలా ఆడి ఈ పొజీషన్ కి వచ్చాను. ఏం జరిగింది? నాకు టైటిల్ ఎలా దక్కింది? అనేవి నేను పట్టించుకోను. టైటిల్ కొడతా అన్నాను కొట్టి చూపించాను. ఫేమ్ తెచ్చుకుంటే డబ్బు అదే వస్తుంది. నమ్మిన వాళ్ళు హౌస్లో బాధపడేలా కామెంట్స్ చేశారని రేవంత్ అన్నాడు. ఆడవాళ్లును పొగుడుతూ, వాళ్ళ పక్క స్టాండ్ తీసుకొని ఆడారని శ్రీహాన్ ని ఉద్దేశించి రేవంత్ మాట్లాడాడు.

    ‘మరోవైపు నాగార్జున చెప్పారు కదా… టైటిల్ గెలవకపోయినా నేనే రియల్ విన్నర్. జనాలు నాకు ఓట్లు వేసి గెలిపించారని’ శ్రీహాన్ కామెంట్ చేశారు. ఈ క్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఎవరు గొప్పగా ఆడారు? టైటిల్ కి అర్హులు ఎవరు?అనే విషయంలో కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది అంటున్నారు.