Unstoppable 2 With NBK Pawan : ఫంక్షన్స్, ఇంటర్వూస్ లో పాల్గొనడానికి ఇబ్బంది పడే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగా మారిపోయాడు.. ఉపన్యాసాలు బాగా ఇవ్వడం వల్ల తనలో ఉన్న బిడియం.. బెరుకు అన్నీ పోయాయి..గతం లో పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మనస్ఫూర్తిగా మాట్లాడడం చాలా అరుదుగా చూసేవాళ్ళం..కానీ ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ లేడు..కానీ ఇప్పటి వరకు ఆయన టాక్ షోస్ పాల్గొనడం ఎప్పుడూ మనం చూడలేదు.

కానీ మొట్టమొదటిసారి ఆయన ఆహా మీడియా లో విజయవంతంగా నడుస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK 2′ సీజన్ లో ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు..అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరగబోతోంది.. సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.. ఈ ఎపిసోడ్ తోనే ఈ షో ముగియబోతుంది అట..త్వరలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు అధికారికంగా తెలియ చేయబోతుంది ఆహా మీడియా టీం.
అయితే ఈ ఎపిసోడ్ లో బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ని అడగబోతున్న ప్రశ్నలు ఇవే అంటూ సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది..ముందుగా ఆయన 2014 వ సంవత్సరం లో ఎలాంటి పదవి ఆశించకుండా తెలుగు దేశం పార్టీ కి నిండు మనసుతో సపోర్ట్ చేసినందుకు..ఆ పార్టీ గెలుపుకు ప్రధాన కారణం అయ్యినందుకు గాను పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలియచేయబోతున్నాడట..ఆ తర్వాత 2019 ఎన్నికలలో ఓటమి గురించి..ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు అనే దాని గురించి బాలయ్య బాబు అడగబోతున్నాడట..ఇక ఈ షో మధ్యలో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తో కూడా వీడియో కాల్ లేదా ఆడియో కాల్ చేయబోతున్నాడట..బాలయ్య బాబు కూడా కాసేపు మెగాస్టార్ తో చిట్ చాట్ చెయ్యబోతున్నాడు.
ఇక ఈ షో కి పవన్ కళ్యాణ్ తో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొనబోతున్నారు అనే విషయం తెలిసిందే..’హరి హర వీరమల్లు’ చిత్రం గురించి సరికొత్త విశేషాలు కూడా కాసేపు చర్చకి రాబోతున్నట్టు తెలుస్తోంది.. వీటితో పాటు తెలుగు దేశం పార్టీ – జనసేన పార్టీ పొత్తు గురించి కూడా ఒక క్లారిటీ రాబోతున్నట్టు తెలుస్తోంది.. ఇలా ఈ ఎపిసోడ్ స్క్రిప్ట్ మొత్తాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డిజైన్ చేసినట్టు సమాచారం.