Bigg Boss Winner Bindu Madhavi 84 రోజులు.. 18 మంది కంటెస్టెంట్స్ ను దాటి.. బిగ్ బాస్4 సీజన్ రన్నరప్ అఖిల్ లాంటి బలమైన కంటెస్టెంట్ ను ఓడించి మరీ ‘ఆడపులి’ బెబ్బులిలా గాండ్రించింది. తెలుగింటి ఆడపిల్ల సత్తా చాటింది. ఆడపులిగా విజృంభించి బిగ్ బాస్ టైటిల్ ను కొల్లగొట్టింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే సరికొత్త చరిత్రకు నాంది పలికింది.
ఈ సాయంత్రం మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ వేదికపై అఖిల్, బిందుమాధవి చేయిపట్టుకున్న నాగార్జున చివరకు బిందునే విజేతగా ప్రకటించారు. మరోసారి అఖిల్ రన్నరప్ కే పరిమితమయ్యారు. యాంకర్ శివ మూడోస్థానంలో నిలిచారు. అరియానా నాలుగో స్థానంతో ముగిసింది.
ఆడపులిగా విజృంభించిన బిందుమాధవి బిగ్ బాస్ హౌస్ లో శత్రువుల్ని వేటాడింది.. బిగ్ నాన్ స్టాప్ విజేతగా అవతరించి కొత్త చరిత్రకు నాంది పలికింది. బిగ్ బాస్ చరిత్రలో విజేతగా నిలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. తన మాటే బలహీనత అని భయపడిన బిందు.. అదే మాటతీరుతో అందరి మనసులు గెలిచి.. బలహీనతనే బలంగా మార్చుకొని బిగ్ బాస్ విజేతగా నిలిచింది.
బిందుమాధవి తన మాటనే తూటాగా మలిచి చెలరేగి ఆడి ప్రత్యర్థులకు అందనంత ఎత్తుకు ఎదిగింది. బిగ్ బాస్ గెలవాలంటే బుద్దిబలం ముఖ్యమని.. కండబలం సరిపోదని మరోసారి నిరూపించింది. గేమ్ ఆడడం రాదన్న వారి నోళ్లు మూసేలా టైటిల్ గెలిచి సత్తా చాటింది. ఆమెను జీరో అన్న వారికి మహిషాసుర మర్దినిగా ఉగ్రరూపాన్ని చూపించింది. కొట్టడానికి వచ్చిన వాళ్లకే పిచ్చెక్కించేలా ‘కప్పు నీ ముందు తీసుకొని చూపిస్తానంటూ’ శపథం చేసింది. అన్నట్టుగానే అందరి అంచనాలు అందుకొని కప్పు కొట్టి చూపించింది.
బిందుమాధవి మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్లలా గేమ్ ఆడింది లేదు. టాస్క్ లలో వీక్ అని అందరూ అన్న తన మంచి గుణంతోనే ప్రేక్షకుల మనసు గెలిచింది. అందరూ గ్రూపు కట్టి ఎదురించినా సింగిల్ గానే సివంగిలా పోరాడింది. అఖిల్, నటరాజ్ మాస్టర్ తో పోరాడిన తీరే ఆమెను విజేతగా చేయడానికి దోహదపడ్డాయి.
బిందుమాధవి పక్కా ప్రణాళికతో ఆడింది. ఆట తప్ప వేరే ధ్యాస లేదన్నట్టుగా గేమ్ ఆడింది. ఎవరితో బంధాన్ని కలుపుకోవాలి.? ఎవరితో దూరంగా ఉండాలి అన్నది నిర్ధేశించుకొని మరీ మంచి స్నేహాలతో స్ట్రాటజిక్ ప్లే చేసి నిలిచి గెలిచింది.
యాంకర్ శివ స్నేహంతోనే బిందుమాధవి ట్రాక్ తప్పలేదు. అఖిల్ కానీ ఇంకెవరితో ఉన్నా కాస్త తడబడేదేమో.. ముందు చూపుతో స్నేహాలను ఏర్పరుచుకొని వారు తప్పు చేసినా చెప్పి మరీ నామినేట్ చేసి సరిదిద్దింది.
మాట్లాడే మాట.. ప్రవర్తనతోనే బిందు హౌస్ లో.. బయట ప్రేక్షకుల మనసు గెలిచింది. బిగ్ బాస్ హౌస్ లో బిందు ఎక్కడా లూజ్ కాకుండా.. ఎలా ప్రవర్తిస్తే బిగ్ బాస్ హైలెట్ చేస్తారో గమనించి మరీ గేమ్ ఆడింది. మరీ విచ్చలవిడిగా ఆషురెడ్డిలా రెచ్చిపోకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా పద్ధతిగా దుస్తులు వేసుకొని అందరి మనసు గెలిచింది.
అఖిల్ ను తిట్టినా.. నటరాజ్ ను రా అన్నా.. తినే కంచాన్ని నెట్టేసినా ఆమె తప్పులను సరిదిద్దుకున్న తీరు.. తప్పును అంగీకరించి నిజాయితీ చాటుకున్న తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. డిఫెండ్ చేసుకొని ప్రత్యర్థులను హీరోలుగా చేయకుండా ఆడిన గేమ్ యే బిందును విజేతగా నిలిపింది. ఎటాకింగ్ గేమ్ ఆడి.. బుద్దిబలంతో బిగ్ బాస్ ప్రేక్షకుల మనసు గెలిచిన బిందు చివరకు టైటిల్ విన్నర్ గా అవతరించింది.
-బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లో బిందుమాధవి విజయ రహస్యం ఇదీ
బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లోనూ బిందుమాధవి విజయ రహస్యం కూల్ అండ్ కామ్.. ఓటీటీ నాన్ స్టాప్ లో బిందుమాధవి ఇప్పటివరకూ ఫిజికల్ టాస్క్ లు తను ఆడింది లేదు.. ఇంతవరకు ఒక్కసారి కూడా గేమ్ లో గెలవలేదు. ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. ఇంట్లో శివ తప్పితే ఫ్రెండ్స్ కూడా లేరు. ఒంటరిపోరాటం చేస్తోంది. అదీ సిన్సియర్ గా చేస్తోంది. అఖిల్ లాంటి బలమైన కంటెస్టెంట్ ఉన్నా.. అతడు ఇతరులపై ఆధారపడి తన గేమ్ ను ఆడుతుంటాడు. కానీ ఎన్ని కష్టాలు, కన్నీళ్లు వచ్చినా బిందుమాధవి గ్రూపిజం కట్టలేదు. ఎదుటివారిపై ఆధారపడలేదు. తన ఫ్రెండ్ అయిన శివను కూడా గొడవలు వచ్చి ఒకసారి నామినేట్ చేసింది. యుద్ధంలో ఒంటరిగా.. నిక్కచ్చిగా పోరాడితేనే విజయం దక్కుతుందని ఒక యోధురాలిలా నిలబడింది.
అఖిల్, నటరాజ్ మాస్టర్ సహా కొంతమంది ఎంత కవ్వించినా.. వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసి విమర్శలు చేసిన బింధుమాధవి బెదరలేదు.. భయపడిపారిపోలేదు. ధైర్యంగా ఎదుర్కొంది. ఇంట్లోని అఖిల్ గ్రూప్ ఎంత టార్గెట్ చేసి హింసించినా సరే వాటిని మొండిపట్టుదలతో ఎదుర్కొంది. ఇంతమంది ఒక ఆడకూతురిపై ఇంతలా వ్యవహరించడమే ప్రేక్షకుల్లో బిందుమాధవిపై సానుభూతికి కారణమైంది. ఆమెకు ఇదే ఓట్ల వర్షం కురిపిస్తోంది. జనాలు ఇందుకే బిందును ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. ఈ సమాజంలో ఎవరైతే వివక్షకు గురి అవుతారో వారే ఫైటర్ లు అవుతారు.. ‘కేజీఎఫ్2’ కూడా అలాంటి కథనే. అందుకే అంతలా ఆడింది.. ఈ థీమ్ ప్రేక్షకులకు ఎప్పుడూ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఒంటరితనం.. సిన్సియారిటీతో కూడిన నీతి నిజాయితీనే బిందుమాధవిని బిగ్ బాస్ ఓటీటీ విజేత దిశగా అడుగులు వేయిస్తోంది. ఆమె మొండిపట్టుదల.. ధైర్యమే ముందుకు నడిపిస్తోంది. మనమూ బిందుమాధవి స్ఫూర్తిదాయ పోరాటాన్ని ప్రశంసిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుదాం.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Bigg boss winner bindu madhavi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com