https://oktelugu.com/

Bigg Boss Telugu 5: షణ్ముక్ తో రోమాన్స్.. సిరి తన బాయ్ ఫ్రెండ్ ను వదిలేసిందా?

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఈ వీకెండ్ అందరినీ రక్తికట్టింది. కన్నీళ్లు పెట్టించింది. ఎందుకంటే బిగ్ బాస్ లోని కంటెస్టెంట్ల ప్రియమైన కుటుంబ సభ్యులను ఇంటిలోకి పంపించి బిగ్ బాస్ ఎమోషనల్ ను రెట్టింపు చేశారు. కన్నీళ్లు, ఆనందం కలగలిపి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. అయితే శుక్రవారంతో ఇంటి సభ్యులను చూపించడం అయిపోలేదు. శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో ప్రోమో కొద్దిసేపటి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2021 / 07:28 PM IST
    Follow us on

    Bigg Boss Telugu 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఈ వీకెండ్ అందరినీ రక్తికట్టింది. కన్నీళ్లు పెట్టించింది. ఎందుకంటే బిగ్ బాస్ లోని కంటెస్టెంట్ల ప్రియమైన కుటుంబ సభ్యులను ఇంటిలోకి పంపించి బిగ్ బాస్ ఎమోషనల్ ను రెట్టింపు చేశారు. కన్నీళ్లు, ఆనందం కలగలిపి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది.

    siri shanmukh

    అయితే శుక్రవారంతో ఇంటి సభ్యులను చూపించడం అయిపోలేదు. శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో ప్రోమో కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. అందులో ఇంటి సభ్యులకు సంబంధించిన మరికొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులను వేదికపైకి తీసుకొచ్చారు.

    ఈ సందర్భంగా యాంకర్ రవి వేదికపైకి రావడంతో అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు బిగ్ బాస్ రాజా’ అని తల్లి అనడంతో ఉప్పొంగిపోయాడు.

    ఇక సీజన్ 1 విజేత శివ బాలాజీ కూడా హౌస్ లోకి రావడంతో మరింత సందడి నెలకొంది. బిగ్ బాస్ లోతు ఎంతో తెలిసిందా? అంటూ శివబాలాజీ హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకున్నాడు.

    చిట్టచివరగా వచ్చాడు సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్. అతడు రాగానే భావోద్వేగం ఆపుకోలేకపోయిన సిరి ఏడుస్తూ ఉండిపోయింది. ఇక హౌస్ లో షణ్ముక్ తో రోమాన్స్ చేస్తున్న సిరిని ఆమె బాయ్ ఫ్రెండ్ ఒక సీరియస్ ప్రశ్న అడిగాడు.. ‘సిరి వదిలేస్తున్నావా?’ అని అందరి ముందు అడిగేశాడు. ఆ ప్రశ్నకు కన్నీళ్లు పెట్టుకుంది. అదేం ప్రశ్న? దానికి సిరి ఏం చెప్పింది? వీళ్ల ప్రేమ బ్రేకప్ అయ్యిందా తెలియాలంటే ఈ రాత్రి వరకూ ఆగాల్సిందే..

    బిగ్ బాస్ ప్రోమో