Akhanda: బాలయ్య బాబు అఖండ సినిమా గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ పుకారు బలంగా వినిపిస్తోంది. ఆ పుకారు సారాంశం ఏమిటంటే.. అఖండ రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తోంది కాబట్టి.. బాలయ్య సామాజిక వర్గానికి సంబంధించిన కొందరు వ్యక్తులు సీక్రెట్ గా అఖండ ప్రీమియర్ షోల కోసం రంగం సిద్ధం చేస్తున్నారట. అఖండ సినిమాను తొలి రోజు నభూతో, న భవిష్యత్ అనేలా ప్రదర్శించాలని బాలయ్య కుల వర్గ నాయకులు గట్టిగా ప్లాన్ చేస్తున్నారట.
మరి ఇందులో ఎంత నిజం ఉంది ? నిజంగానే అఖండ ప్రీమియర్ షోల కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయా ?. అయితే, సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రీమియర్ షోలను ఆడించాల్సిన పరిస్థితి బాలయ్య అఖండకు లేదు. బుకింగ్స్ స్టార్ట్ అయిన గంటకే టికెట్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది సొంత డబ్బు పెట్టి, సినిమాను ఎందుకు ఆడిస్తారు ?
అంటే, ఎలాగూ తమ హీరో సినిమాకు ఓపెనింగ్స్ రావు కాబట్టి… బాలయ్య అభిమానులు ఇలా తలో చేయి వేయడానికి రెడీ అయిపోయారా ? స్వంత సొమ్ము కొంత వెచ్చించి మరీ సినిమా ఆడించాలా ? లేకపోతే బాలయ్య సినిమాకు కనీస కలెక్షన్స్ కూడా రావా ? నిజాలు ఏవి అయినా, వాస్తవంగా మాట్లాడుకుంటే.. బాలయ్య సినిమా ప్రీమియర్ షోలకు స్పాన్సర్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
Also Read: శిల్పంతో వల విసిరింది.. సినీ హీరోలు గిలగిలా కొట్టుకుంటున్నారు..!
బాలయ్య అభిమానులకే కాదు, బాలయ్య సామాజిక వర్గ జనాలకు కూడా.. బాలయ్య సినిమా అంటే ప్రత్యేక ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా బాలయ్య సినిమాని తొలి రోజు చూపించడానికి అభిమానులు తెగ తాపత్రయ పడిపోతూ ఉంటారు. అమెరికాలో కూడా ఇదే తంతు జరుగుతూ ఉంటుంది. పైగా అమెరికాలో బాలయ్య సినిమా అనగానే చందాలు వేసుకుంటారు. ఎందుకంటే.. సినిమాని ఆడించడానికి తలా చేయి వేయడం అన్నమాట.
సినిమా రిలీజ్ మొదటి రోజు అమెరికాలో ఒక్కొక్కరు ఒక షో, రెండు షో లు వంతున బాలయ్య సినిమాకు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం అనేది వాళ్ళు ఓ గౌరవంగా ఫీల్ అవుతారు. ఇక బాలయ్య సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాత అయితే, కూకట్ పల్లిలో రెండు అఖండ ప్రీమియర్ షోలు బుక్ చేసి.. బాలయ్య సన్నిహితులను, అలాగే సినిమా వాళ్ళను పిలుస్తున్నాడట. ఇవ్వన్నీ కుల పిచ్చితోనే చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Also Read: మద్యం కలుపుతూ బుట్టబొమ్మ వీడియో వైరల్.. ఇంత చీప్ టేస్ట్ అనుకోలేదంటూ ట్రోల్స్!