
Bigg Boss Priyanka: పేరుకే ట్రాన్స్జెండర్ కానీ అమ్మాయిలకు మించిన అందం ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ సొంతం. ఒకప్పటి ఈ జబర్దస్త్ కమెడియన్ బిగ్ బాస్ షోకి వెళ్ళాక బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 5లో ప్రియాంక పాల్గొన్నారు. జబర్దస్త్ కమెడియన్ హోదాలో ఆమెకు హౌస్లో అడుగుపెట్టే అవకాశం దక్కింది. ప్రియాంక చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించుకున్నారు. పది వారాలకు పైగా హౌస్లో ఉన్నారు. ఈమె ఓ లవ్ ట్రాక్ కూడా నడపడం కొసమెరుపు. సీరియల్ యాక్టర్ మానస్ మీద ప్రియాంక అమితమైన ప్రేమ చూపించింది. అతని చుట్టే తిరిగేది.
హౌస్లో ఉన్న అబ్బాయిలందరూ నాకు అన్నయ్యలే ఒక్క మానస్ తప్పా అంటూ… ఓపెన్ గా తన మనసులో కోరిక బయటపెట్టింది. అందంగా రెడీ కావడం ప్రియాంకకు ఇష్టమైన వ్యాపకం. గంటల తరబడి మేకప్ వేసుకునేది. ఇదే హౌస్లో ప్రియాంక తాను ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం తెలియజేశారు. సాయి తేజ అనే అబ్బాయిగా పుట్టిన నేను అమ్మాయిగా మారానని, ఆడదిగా ఉండటం నాకు ఇష్టం అంటూ ఎమోషనల్ అయ్యింది. వాళ్ళ నాన్నకు సారీ చెప్పింది.
ప్రియాంక కెరీర్ జబర్దస్త్ షోతో మొదలైంది. ఆమె లేడీ గెటప్స్ వేసేవారు. జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఇంకా ఆమె ట్రాన్స్ జెండర్ కాలేదు. లేడీ గెటప్ లో చాలా అందంగా ఉండే సాయి తేజకు జబర్దస్త్ లో అవకాశాలు మెండుగా దొరికాయి. దాంతో కొన్నాళ్ళు జబర్దస్త్ లో పలు టీం మెంబర్స్ తో పని చేశారు. సడన్ గా ఆ షో నుండి సాయి తేజా మాయమయ్యాడు. కొన్నాళ్ళకు ప్రియాంక సింగ్ గా బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ప్రియాంకకు కొంత ఇమేజ్, ఫేమ్ ఉన్నాయి. ఆమె బుల్లితెర మీద రాణిస్తున్నారు.

సోషల్ మీడియాలో అందుబాటులో ఉండే ప్రియాంక గ్లామరస్ హీరోయిన్స్ మాదిరి ఫోటో షూట్స్ చేయడం విశేషం. తాజాగా ఆమె సంచలనానికి తెరలేపారు. బ్రా, షార్ట్ ధరించి సెమీ న్యూడ్ గా దర్శనమిచ్చారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన ప్రియాంక బోల్డ్ ఫోటో వైరల్ అవుతుంది. ఇటీవల నాకు పెళ్లి కుదిరిందంటూ థంబ్ నైల్ పెట్టి యూట్యూబ్ వీడియో విడుదల చేసింది. వీడియో చివర్లో జస్ట్ ఫ్రాంక్ అంటూ షాక్ ఇచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒకింత హర్ట్ అయ్యారు.