https://oktelugu.com/

Bigg boss 6 Telugu Geetu : డబ్బులు ఇచ్చి మోసపోయా… అమ్మకే అర్థం కాలేదు జనాలకు ఏం అర్థం అవుతానన్న గీతూ

Bigg boss 6 Telugu Geetu : బిగ్ బాస్ ఎలిమినేషన్ షాక్ నుండి గీతూ ఇంకా బయటపడలేదు. ఆమె ప్రతి వీడియోలో, ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుంటున్నారు. తన యూట్యూబ్ ఛానల్ లో ఎలిమినేషన్ కి కారణాలు వివరిస్తూ సుదీర్ఘ వీడియో పోస్ట్ చేశారు. గీతూ తన ఎలిమినేషన్ పూర్తి బాధ్యత తనదే అని చెప్పింది. అమ్మ చెబుతూనే ఉంది. మరీ ముక్కుసూటిగా ఉంటే వర్క్ అవుట్ కాదు. ఎంతో కొంత లౌక్యం అవసరం. అప్పుడే రాణిస్తావని ఆమె […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2022 / 11:02 AM IST
    Follow us on

    Bigg boss 6 Telugu Geetu : బిగ్ బాస్ ఎలిమినేషన్ షాక్ నుండి గీతూ ఇంకా బయటపడలేదు. ఆమె ప్రతి వీడియోలో, ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుంటున్నారు. తన యూట్యూబ్ ఛానల్ లో ఎలిమినేషన్ కి కారణాలు వివరిస్తూ సుదీర్ఘ వీడియో పోస్ట్ చేశారు. గీతూ తన ఎలిమినేషన్ పూర్తి బాధ్యత తనదే అని చెప్పింది. అమ్మ చెబుతూనే ఉంది. మరీ ముక్కుసూటిగా ఉంటే వర్క్ అవుట్ కాదు. ఎంతో కొంత లౌక్యం అవసరం. అప్పుడే రాణిస్తావని ఆమె చెప్పారు. కానీ నేను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాను. హౌస్లో నేను ప్రతి నిమిషం జెన్యూన్ గా ఆడాను.అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నా ఒక్క నిమిషం కూడా ఫేక్ ఆడలేదు.

    నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు. చిన్నప్పటి నుండి స్కూల్ లో, కాలేజ్ లో ప్రతిచోట నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోయాను. ఇప్పుడు కూడా అదే జరిగింది. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను మోసం చేశారు. వాళ్ళు నా కోసం చాలా చేస్తారు అనుకుంటే ఏమీ చేయలేదు. ఒకరిద్దరు తప్పితే ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్ ఇచ్చారు. ఒక రివ్యూవర్ ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటే సోషల్ మీడియాలో ఫండ్ రైజ్ చేశాను. అతడు కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాడు.

    నేను పిఆర్ లను పెట్టుకోలేదు. నేను ఇష్టపడే బిగ్ బాస్ మీద ఒట్టేసి చెబుతున్నా నాకు పిఆర్లు లేరు. ఒక వ్యక్తికి మాత్రం నెగిటివ్ కామెంట్స్ కి పాజిటివ్ రిప్లైలు ఇవ్వాలని రూ. 25 వేలు ఇచ్చా. అతడు కూడా నన్ను మోసం చేశాడు. నేను రివ్యూవర్ గా పిఆర్ లను పెట్టుకున్న వాళ్ళను విమర్శించాను. అందుకే నేను పిఆర్ లను పెట్టుకోలేదు. బిగ్ బాస్ కి పిఆర్ లు చాలా అవసరం, పిఆర్ లను పెట్టుకో అని కొందరు సలహా ఇచ్చారు. అయినా నేను వినలేదు. జెన్యూన్ గా నన్ను నన్నుగా ప్రేక్షకులకు పరిచయం చేయాలి వాళ్లకు నచ్చి నేను ముందుకు వెళ్లాలి అనుకున్నాను.

    నేను మా అమ్మకే అర్థం కాలేదు జనాలకు ఏం అర్థం అవుతాను. అయితే ఎపిసోడ్ చూసి ఒకరి ఆటను జడ్జి చేయడం తప్పని హౌస్ కి వెళ్ళాక తెలిసింది. అక్కడ ఉన్న 90 కెమెరాల ఫుటేజ్ నుండి కొంత తీసుకొని ఎపిసోడ్ గా ప్రసారం చేస్తారు. కాబట్టి మనకు సంబంధించిన మంచి ఫుటేజ్ ఎడిటింగ్ లో పోవచ్చు. బ్యాడ్ ఫుటేజ్ ప్రసారం కావచ్చు. ఏది ఏమైనా నేను ఓడిపోయాను. నా ఆట కారణంగానే నేను ఎలిమినేట్ అయ్యాను. నేను ఎవరితో ఎలా ప్రవర్తించినా కేవలం ఆటలో భాగంగానే చేశాను… అంటూ గీతూ ఎమోషనల్ అయ్యారు.