https://oktelugu.com/

Inaya Sultana  : షార్ట్ ఫ్రాక్ లో హాట్ థైస్ చూపిస్తూ… బిగ్ బాస్ బ్యూటీ ఇనయా పరువాల జడివాన!

Inaya Sultana  : బిగ్ బాస్ సీజన్ 6 లేడీ టైగర్ గా పేరుగాంచింది ఇనయా సుల్తానా. ఆమె డేరింగ్ యాటిట్యూడ్, ఎఫైర్స్, గట్టిగా ప్రశ్నించే తత్త్వం ప్రత్యేకత తీసుకొచ్చాయి. మొదటి వారం నుండి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇనయా ప్రదర్శించారు. మీరు ఎంతగా టార్గెట్ చేసినా చివరి వరకూ ఉంటా. టైటిల్ గెలుచుకొని పోతా అంటూ గట్టిగా చెప్పేది. ఎఫైర్స్ ఆమె ఇమేజ్ ని కొంచెం దెబ్బతీశాయి. కంటెస్టెంట్ సూర్యను ఇనయా పిచ్చిగా అభిమానించారు. కన్ఫెషన్ రూమ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2023 / 10:18 PM IST
    Follow us on

    Inaya Sultana  : బిగ్ బాస్ సీజన్ 6 లేడీ టైగర్ గా పేరుగాంచింది ఇనయా సుల్తానా. ఆమె డేరింగ్ యాటిట్యూడ్, ఎఫైర్స్, గట్టిగా ప్రశ్నించే తత్త్వం ప్రత్యేకత తీసుకొచ్చాయి. మొదటి వారం నుండి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇనయా ప్రదర్శించారు. మీరు ఎంతగా టార్గెట్ చేసినా చివరి వరకూ ఉంటా. టైటిల్ గెలుచుకొని పోతా అంటూ గట్టిగా చెప్పేది. ఎఫైర్స్ ఆమె ఇమేజ్ ని కొంచెం దెబ్బతీశాయి. కంటెస్టెంట్ సూర్యను ఇనయా పిచ్చిగా అభిమానించారు. కన్ఫెషన్ రూమ్ లో సూర్య నా క్రష్ అని నేరుగా బిగ్ బాస్ కి చెప్పింది. అప్పటి నుండి అతడితో సన్నిహితంగా ఉంది. సూర్య మైకంలో ఇనయా రెండు వారాలు గేమ్ పక్కన పెట్టేశారు.

    దీంతో నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో దూరమైనట్లు కనీసం నటిద్దామని సూర్య, ఇనయా ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఒక వారం ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ఆ వారం సూర్యను ఇనయా నామినేట్ చేసింది. అనూహ్యంగా ఇనయా నామినేట్ చేసిన వీక్ సూర్య ఎలిమినేట్ అయ్యాడు. దాంతో స్నేహితుడికే వెన్నుపోటు పొడిచావంటూ శ్రీసత్య, శ్రీహాన్ ఆమెను టార్గెట్ చేశారు.

    దాదాపు ప్రతివారం ఇనయా నామినేషన్స్ లో ఉండేది. కేవలం ప్రేక్షకుల ఓట్లతో ఆమె ఫైనల్ వీక్ ముందు వరకూ వచ్చారు. 14వ వారం ఇనయా ఎలిమినేట్ కాగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇనయాది ఫేక్ ఎలిమినేషన్ అని ఆడియన్స్ విమర్శలు గుప్పించారు. ఎవరికోసమో ఆమెను బలి చేశారంటూ ఎద్దేవా చేశారు. టాప్ టు కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం ఏమిటని నిర్వాహకులను ప్రశ్నించారు. ఫైనల్ కి చేరకున్నా ఇనయా తాను కోరుకున్న ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆడియన్స్ లో గుర్తింపు రాబట్టారు.

    ఇకపై తన కెరీర్ ఊపందుకుంటుందని ఇనయా భావిస్తుంది. నటిగా బిజీ కావాలని కోరుకుంటుంది. కాగా ఆర్జీవీ పాప్యులర్ చేసిన అమ్మాయిల్లో ఇనయా ఒకరు. ఆయనతో ఓ పార్టీలో పాలొన్న ఇనయా సన్నిహితంగా మెలిగారు. ఈ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఇనయా వెలుగులోకి వచ్చారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఆర్జీవీ ఆమెను సప్పోర్ట్ చేయడం కొసమెరుపు. ఇనయాకు ఓట్లు వేయాలని ఆర్జీవీ పోస్ట్స్ పెట్టేవారు. ఇక ఇనయా సోషల్ మీడియా పోస్ట్స్ కాకరేపుతున్నాయి. గ్లామరస్ ఫోటో షూట్స్ తో అభిమానులను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.