https://oktelugu.com/

Punarnavi: తీవ్ర అనారోగ్యం బారినపడిన బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి… ఈ బాధ మళ్ళీ రాకూడదంటూ ఎమోషనల్ పోస్ట్ 

Punarnavi: బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం న్యూ ఇయర్ వేళ బ్యాడ్ న్యూస్ షేర్ చేశారు. తాను అనారోగ్యం బారినపడినట్లు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పునర్నవి భూపాలం 2013లో విడుదలైన ఉయ్యాలా జంపాలా చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. హీరోయిన్ అవికా గోర్ కి టీనేజ్ ఫ్రెండ్ రోల్ కోసం ఆమెను తీసుకున్నారు. అప్పటికి పుర్నవి ఏజ్ కూడా చాలా తక్కువ. ఉయ్యాలా జంపాలా మూవీలో హీరోయిన్ బావను ప్రేమించే అమ్మాయిగా క్యూట్ యాక్టింగ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 4, 2023 / 05:10 PM IST
    Follow us on

    Punarnavi: బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం న్యూ ఇయర్ వేళ బ్యాడ్ న్యూస్ షేర్ చేశారు. తాను అనారోగ్యం బారినపడినట్లు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పునర్నవి భూపాలం 2013లో విడుదలైన ఉయ్యాలా జంపాలా చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. హీరోయిన్ అవికా గోర్ కి టీనేజ్ ఫ్రెండ్ రోల్ కోసం ఆమెను తీసుకున్నారు. అప్పటికి పుర్నవి ఏజ్ కూడా చాలా తక్కువ. ఉయ్యాలా జంపాలా మూవీలో హీరోయిన్ బావను ప్రేమించే అమ్మాయిగా క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.

    Punarnavi

    అయితే పునర్నవిని బాగా పాప్యులర్ చేసింది మాత్రం బిగ్ బాస్ షో. సీజన్ 3లో ఆమె పాల్గొన్నారు. హౌస్లో టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె ప్రేమాయణం నడిపారు. సీజన్ 3 కి రాహుల్-పునర్నవి లవ్ ట్రాక్ హైలెట్ అని చెప్పాలి. 11వ వారం ఎలిమినేట్ అయిన పునర్నవి బయటకు వచ్చాక రాహుల్ కోసం క్యాంపైన్ చేసింది. ఆ సీజన్ విన్నర్ గా రాహుల్ నిలిచాడు. ఫైనల్ లో శ్రీముఖి-రాహుల్ పోటీపడ్డారు. టైటిల్ మాత్రం రాహుల్ ని వరించింది. శ్రీముఖితో పోల్చుకుంటే రాహుల్ ఫేమ్ చాలా తక్కువ, అయినా ఆడియన్స్ మనసులు గెలిచి టైటిల్ అందుకున్నాడు.

    బయట కూడా కొన్నాళ్లుగా రాహుల్, పునర్నవి సన్నిహితంగా ఉన్నారు. వీరిద్దరికి పెళ్లి అనే ప్రచారం కూడా జరిగింది. అయితే కాలం గడిచే కొద్దీ పునర్నవికి రాహుల్ దూరమయ్యాడు. బిగ్ బాస్ అనంతరం పునర్నవికి ఆఫర్స్ పెరిగాయి. అడపాదడపా చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ఆమె హీరోయిన్ గా ఒక చిన్న విరామం, సైకిల్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. అయితే సడన్ గా ఆమె పరిశ్రమకు దూరమయ్యారు.

    Punarnavi

    పునర్నవి ప్రస్తుతం లండన్ లో ఉంటున్నట్లు సమాచారం. ఆమె అక్కడ సైకాలజీలో డిగ్రీ చేస్తున్నారట. విదేశాలకు వెళ్లినా ఫ్యాన్స్ తో మాత్రం టచ్ లో ఉంటారు. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడూ వారితో ముచ్చటిస్తూ ఉంటారు. కాగా తనకు చెస్ట్ కన్జెషన్ వ్యాధి సోకిందట. లంగ్స్ కి సంబంధించిన ఈ డిసీజ్ తో తాను బాధపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. నా నూతన సంవత్సరం ఇలా మొదలైంది. ఇలాంటి అనారోగ్యం బారిన జీవితంలో మరలా పడకూదని భావిస్తున్నాను అంటూ.. కామెంట్ పెట్టింది. పునర్నవి అనారోగ్యం బారిన పడ్డారని తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.

    Tags