Bigg Boss 6 Telugu Weekend Review బిగ్ బాస్ వీకెండ్ శనివారం సీజన్ కు నాగార్జున రావడంతో జోష్ నెలకొంది. శుక్రవారం ఏం జరిగిందన్నది నాగార్జున తొలుత చూపించారు. ఈ సందర్భంగా ఆలుమగలు అయిన మెరీనా జోడీ సరసాలు… గీతూ-ఆదిరెడ్డి చాడీలు చూపించారు. ఇంకొందరి సరదా కామెంట్లతో శుక్రవారం ఎపిసోడ్ ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. నేహా, రాజ్ ను సీక్రెట్ రూంలోకి పంపించి ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు.

బిగ్ బాస్ నేహాకు అనుకున్నట్టే ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆమె కోసం ఓ కేక్ పంపించాడు. ఆమె బర్త్ డే కోసం నేహా అన్నయ్యను బిగ్ బాస్ ఇంట్లోకి పంపించాడు. బయట ఆమె అన్నయ్యను పెట్టి.. ఇంట్లో నేహాను పెట్టి ఇద్దరి చేత కేక్ కట్ చేయించారు. నేహా తోపాటు ఆమె అన్నయ్య కూడా ఈ ఎమోషనల్ కు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సర్ ప్రైజ్ అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
బిగ్ బాస్ హౌస్ లోని ఇంటిసభ్యులతో చిట్ చాట్ నిర్వహించిన నాగార్జున అందరికీ హితబోధ చేశాడు. అందరిలోకి ఫైమా, కీర్తి, ఆర్జే సూర్య, బాలాదిత్యలు బాగా ఆడుతున్నారని వారిని పేరుపేరునా కొనియాడారు. ఇక భార్యాభర్తలు మెరీనా జోడీని ఇంట్లో సైలెంట్ గా ఉంటున్నారని.. వారిలో రోమాన్స్ తగ్గిందని అందరి ముందే వారితో గట్టి హగ్ లు, ముద్దులు ఇప్పించాడు నాగార్జున. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ను తిట్టిన సీపీఐ నారాయణకు నాగార్జున సెటైర్ వేశాడు. ‘నారాయణ.. నారాయణ.. వారిద్దరికీ లైసెన్స్ ఉంది’ అంటూ ఆ పొలిటికల్ లీడర్ చెంపపగిలేలా పంచ్ ఇచ్చాడు.
ఇక ఆ తర్వాత ఫీల్ అవుతారని బ్రదర్ అని పిలవవద్దంటూ సీనియల్ నటి కీర్తి భట్ కు హితబోధ చేశాడు. ఇనాయా సుల్తానా తీరును తప్పుపట్టారు. ఇక సింగర్ రేవంత్ ఎంతో చూశాడని.. ఊరికే బరెస్ట్ అయ్యి నోరుపారేసుకోవద్దని.. మెచ్చురిటీతో ఆడు అంటూ నాగార్జున సూచించారు. ఫైమా సంచాలకురాలిగా అద్భుతంగా వ్యవహరించిందని ప్రశంసించారు. ఇక ఆర్జే సూర్య బాగా ఆడుతున్నాడని.. ఇంకా ఓపెన్ కావాలని తెలిపాడు. ఇక గలాటా గీతూ నోటి అందరినీ అదరగొడుతూ రెచ్చిపోతున్నా ఆమె వల్ల ఇతరులు హర్ట్ అవుతున్నారని.. కానీ ఆటతీరు బాగుందని నాగార్జున మెచ్చుకున్నారు.
ఇక చలాకీ చంటి హౌస్ లోకి వెళ్లాక కామెడీ చేయడం లేదని.. చలాకీ చంటిలో బయట ఉన్న ఉత్సాహం లేదని.. మరింతగా హౌస్ లో సందడి చేయాలని సూచించారు. యూట్యూబర్ ఆదిరెడ్డి ప్రతీ ఒక్కరి వద్దకు వెళ్లి రివ్యూ చెబుతాడని.. అందరి మధ్య పుల్లలు పెడుతున్నాడని అతడికి నాగార్జున హితబోధ చేశాడు. హౌస్ లో అలా ఉండకూడదని సూచించారు. నేహా బాగా ఆడుతోందని.. ఆమె ఎమోషన్ తగ్గించుకుంటే బెటర్ అని నాగార్జున సూచించారు.ఇలా అందరిపై అభిప్రాయలు చెబుతూ వారు హౌస్ లో ఎలా ఉండాలో నాగార్జున కీలక సూచనలు చేశారు.
ఇక తొలి వారం నామినేషన్ లో ఏడుగురు ఉండగా.. వారిలో ఒకరిని సేవ్ చేశాడు నాగార్జున. ఓ చిన్న టాస్క్ పెట్టి అందులో శ్రీసత్యను సేవ్ చేశాడు. మిగతా ఆరుగురు నామినేషన్లో ఉన్నట్టు ప్రకటించాడు. అనంతరం హౌస్ లోని అందరితో నాగార్జున గేమ్ ఆడించారు. ఒక్కో గుణాన్ని తెలిపేలా కార్డులు ఇచ్చి ఇంటి సభ్యులంతా తమ కార్డ్ లోని గుణానికి అనుగుణంగా ఉన్నవారికి ఇవ్వాలని సూచించాడు. ఈక్రమంలోనే ఎక్కువమంది సింగర్ రేవంత్ తీరు బాగా లేదని గుణాల కార్డులు ఇచ్చారు. అక్కడ నక్క, వెన్నుపోటు దారుడు, పంచ్ ఇలా ఓ 8 కార్డులు సింగర్ కే వచ్చాయి. అందరూ సింగర్ రేవంత్ తీరు బాగాలేదంటూ ఈ కార్డులు ఇచ్చారు.
ఇక నామినేషన్ లో ఉన్న ఆరుగురిలో మరొకరిని సేవ్ చేశాడు నాగార్జున. ఈ సందర్భంగా చలాకీ చంటి సేఫ్ అయ్యాడు. నామినేషన్స్ లో ఇంకా ఐదుగురు ఉన్నారు. ప్రస్తుతం నామినేషన్స్ లో అభినయశ్రీ, ఫైమా, రేవంత్, ఆరోహి, ఇనాయాలు ఉన్నారు. ఈ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది రేపు తెలియనుంది.
