Amala Paul: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది ‘అమలా పాల్’ పరిస్థితి. అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో పెళ్లి పై అమ్మడు ఆశ పడింది. పైగా పెద్ద ఇంటి సంబంధం, ఇక తనకు తిరుగు లేదు అనుకుంది. వచ్చిన భారీ ఆఫర్లను ఎడమ కాలితో ఛీ కొట్టింది. కట్ చేస్తే.. పెళ్లి పెటాకులు అయింది. ఇక చేసేది లేక, మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం రోజురోజుకు దిగజారిపోతూ ఉంది. ఈ క్రమంలో పంజాబీ సింగర్ భవ్‌నిందర్ సింగ్ కి దగ్గర అయ్యింది. ఇద్దరూ బాగా సన్నిహితంగా మెలిగారు.

కట్ చేస్తే.. భవ్‌నిందర్ సింగ్ తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి లాకప్ లో వేశారు. అయితే, ఆ తర్వాత పోలీస్ లకు షాకింగ్ నిజాలు తెలిశాయి. అతన్ని హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. భవ్‌నిందర్ సింగ్ ని 2017లోనే అమల పెళ్లి చేసుకుందట. తమ పెళ్లి జరిగిందని భవ్‌నిందర్ సింగ్ తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించారు.
దీంతో అమల రెండో పెళ్లి నిజమేనని పలు న్యూస్ పేపర్లలో వార్తలు వస్తున్నాయి. దాంతో అమలా పాల్ వివరణ ఇవ్వడం మొదలు పెట్టింది. అయినా ఆల్రెడీ చేతులు కాలాయి. పైగా ఈ బ్యూటీకి బొబ్బలెక్కాయి కూడా. అసలు ముందు జాగ్రత్తగా ఉంటే చేతులు కాలవు కదా. కాలిపోయిన తర్వాత అందరూ కామెంట్స్ చేస్తున్నారంటే ఎందుకు చేయరు ? ఏది ఏమైనా ’దెప్పేవారికి దెప్ప సందు, అనేవారికి అన సందు’ అని సామెత గుర్తుకు వస్తోంది అమలా పాల్ కెరీర్ ను చూస్తుంటే.

నిజమే అమలా పాల్ కి ఇప్పుడు కొత్త సమస్యలు రాబోతున్నాయి. మరోపక్క అమలా పాల్ కి మీడియం రేంజ్ హీరోలు కూడా ఛాన్స్ లు ఇవ్వడం మానేశారు. ఒక్క రాంగ్ స్టెప్ స్థాయిని తగ్గించింది. ఇప్పుడు కూడా అవకాశాలు లేవు. మరి ఇలా అని స్థాయిని తగ్గించుకునే పనులు చేస్తే.. అసలుకే మోసం వస్తోంది. ఈ విషయం ఈ హీరోయిన్ కి ఎందుకు అర్థం కాలేదో పాపం.
నిజానికి ప్రస్తుతం అమలా పాల్ చేతిలో ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. కాకపోతే అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ సిరీస్ తో తన కెరీర్ మళ్లీ జోరుగా సాగిపోతుందని అమలా పాల్ ఆశ పడుతుంది. ఇప్పుడు అమ్మడు పోలీస్ లకు ఇచ్చిన రాంగ్ సమాచారం దెబ్బకు కొత్త సమస్యలను కొని తెచ్చుకుంది.