Bigg Boss 6 Telugu- Revanth: ఒక మీడియం రేంజ్ సెలబ్రిటీ కి బిగ్ బాస్ లాంటి వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో అవకాశం రావడం అనేది ఒక వరం లాంటిది..ఒక్కమాట లో చెప్పాలంటే వాళ్ళ కెరీర్ ని చక్కదిద్దుకోవడానికి దేవుడు ఇచ్చిన మరో అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు..అలాంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో లో టైటిల్ గెలుచుకోవడం అంటే మాటలా..అందుకే కంటెస్టెంట్స్ అందరూ టైటిల్ గెలుచుకోవడానికి పోట్లగిత్తలు లాగ టాస్కులను పోటీపడి మరీ ఆడుతారు..కానీ అందరూ కలిసి ఒక చోట ఉన్నాక స్నేహం, ప్రేమ వంటివి ఆటని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది.

కానీ బిగ్ బాస్ చివరి రోజుల్లో మాత్రం వాటి అన్నిటిని పక్కన పెట్టి ఆడేస్తారు..ఇప్పుడు జరుగుతుంది కూడా అదే..ఈ సీజన్ లో మొదటి రోజు నుండి నేటి వరుకు టైటిల్ విన్నర్ అయ్యేంత కెపాసిటీ ఉన్న కంటెస్టెంట్ రేవంత్..పబ్లిక్ లో కూడా ఇతనికి ఉన్న ఫాలోయింగ్ వేరు..మొదటి రోజు నుండి నేటి వరుకు ఆయన ఓటింగ్ లో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూ వస్తున్నాడు.
దానితో ఇప్పుడు హౌస్ మేట్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ రేవంత్ ని చాలా తీవ్రంగా టార్గెట్ చేసారు..అతను చేసిన తప్పులను పొరపాట్లను ఎత్తి చూపుతూ ఆడియన్స్ లో రేవంత్ పై నెగటివ్ వచ్చేలా చెయ్యడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు..ఈ మిషన్ నిన్న నామినేషన్స్ ప్రక్రియ అప్పుడే ప్రారంభం అయ్యింది..ఫైమా మరియు ఆది రెడ్డి రేవంత్ తప్పులను బలంగా ఎత్తిచూపి అతని పై జనాల్లో నెగటివ్ అభిప్రాయం తెప్పించడం లో సక్సెస్ అయ్యారు..నేను ఏదైనా తప్పు చేస్తే ధైర్యం గా ఒప్పుకుంటాను..నీకు ఆ ధైర్యం లేదంటూ ఆది రెడ్డి..ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడుతున్నాడు ఇది ఎవ్వరు గమనించడం లేదా అని రేవంత్ గతం లో చేసిన పొరపాట్లని ఎత్తిచూపుతూ ఫైమా టార్గెట్ చెయ్యడం రేవంత్ పై సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేలా చేసాయి.

మరోపక్క మొదటి రోజు నుండి హౌస్ లో ఒక మంచి స్నేహితుడిగా ఉంటూ వచ్చిన శ్రీహాన్ ఇప్పుడు తనకి శ్రీ సత్య తో ఉన్న మంచి స్నేహాన్ని, నీ నోటి దూల తప్పుడు ఆలోచనలతో జనాలకు వేరే విధంగా ప్రాజెక్ట్ చేస్తున్నావ్ అని పదేపదే రేవంత్ పై రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు..ఇలా హౌస్ మేట్స్ అందరూ రేవంత్ పై టార్గెట్ చేసారు..మరి టార్గెట్ రేవంత్ కి పాజిటివ్ అవుతుందా..నెగటివ్ అవుతుందా అనేది చూడాలి.