Bigg Boss 6 Telugu- baladitya: బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో చూసే ప్రేక్షకులకు మంచోడిగా అనిపించినవాడు బాలాదిత్య..కానీ ఈరోజు జరిగిన ‘మిషన్ పాజిబుల్’ టాస్కులో తన మీద ఉన్న మంచి అభిప్రాయం ని మొత్తం చెడిపేసుకున్నాడు అనే చెప్పొచ్చు..ఆట అన్న తర్వాత ఎవరి వ్యూహాలు వారివి..కొంతమంది బలహీనతో ఆడొచ్చు..కొంతమంది తెలివితో ఆడొచ్చు..ఎలా ఆడిన అవతల వ్యక్తి ఆ ట్రాప్ లో పడకుండా దెబ్బకి దెబ్బ తీసేదే గేమ్ అంటే.

కానీ బాలాదిత్య ఈరోజు గీతూ వేసిన ట్రాప్ లో చిక్కుకొని నోటికి వచ్చిందల్లా మాట్లాడేసాడు..అది కేవలం ఇంటి సభ్యులకే కాదు..చూసే ప్రేక్షకులకు కూడా చాలా అసహ్యంగా అనిపించింది..ఈరోజు ‘మిషన్ పాజిబుల్’ టాస్కులో భాగంగా బిగ్ బాస్ ‘రెడ్ స్క్వాడ్’ గా ఒక టీం..’బ్లూ స్క్వాడ్’ గా మరో టీం గా విడిపోయి ఆడమన్నారు..ప్రతి ఒక్క సభ్యుడు తమ టీ షర్ట్స్ కి తమ స్క్వాడ్ కి తగ్గట్టు గా ‘రెడ్’ స్ట్రిప్స్ మరియు ‘బ్లూ’ స్ట్రిప్స్ నాలుగు నాలుగు చొప్పున అతికించుకోవాలి.
అలా అంటించుకున్న ఇంటి సబ్యులకు ఎదురు టీం వారు ఎవరైతే టీ షర్ట్ కి తగిలించుకున్న నాలుగు స్ట్రిప్స్ ని తొలగించేస్తే ఆ ఇంటి సభ్యుడు చనిపోయినట్టు లెక్క అన్నమాట..ఈ ఆట లో భాగంగా గీతూ బాలాదిత్య దగ్గర ఉన్న సిగరెట్స్ మరియు లైటర్ ని నొక్కేసి ‘నాకు రెండు స్ట్రిప్స్ ఇస్తే లైటర్ ఇస్తా..నాలుగు స్ట్రిప్స్ ఇస్తే ఒక సిగరెట్ ఇస్తా..ఆరు స్ట్రిప్స్ ఇస్తే రెండవ సిగరెట్ ఇస్తా’ అంటుంది..బాలాదిత్య సిగరెట్ కి ఎంత అడిక్ట్ అయ్యాడో అనేది ఈరోజు ఆయన చేసిన రచ్చ చూస్తే అందరికి అర్థం అయ్యిపోతాది..కేవలం ఒక సిగరెట్ కోసం ఆయన గీతూ ని అనరాని మాటలన్నీ అనేశాడు..’సిగ్గు లేదు నీకు..ప్రేమ లేదు నీకు..నువ్వు అసలు మనిషివే కాదు’ అంటూ ఇలా తిట్ల పురాణం మొదలెట్టాడు.

‘నా జీవితం లో నేను చేసిన తప్పు ఏదైనా ఉందా అంటే అది నిన్ను చెల్లిగా అనుకోవడమే’ అని అంటాడు..ఒక సిగరెట్ కోసం ఇంత ఓవర్ యాక్షన్ చెయ్యాలా అని అందరూ షాక్ కి గురైయ్యాడు..’ఆఫ్ట్రాల్ సిగరెట్ ని అడ్డం పెట్టుకొని ఇంత దిగజారుతావా’ అని ఆయన గీతూ ని తిట్టాడు..కానీ ఆ ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం బాలాదిత్య పూర్తిగా దిగజారిపోయాడని నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.